ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Covid-19: జిమ్ చేస్తూ.. నడుస్తూ.. డాన్స్ చేస్తూనే మరణాలు.. కరోనా కూడా ఓ కారణమా..!?

ABN, First Publish Date - 2022-12-24T14:58:20+05:30

ఇటీవలి కాలంలో ఆకస్మిక మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. డ్యాన్స్ చేస్తూ, స్టేజ్‌పై నటిస్తూ, దేవుడికి దండం పెట్టుకుంటూ కూడా చాలా మంది అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్‌కు (Cardiac Arrest) గురై ప్రాణాలు కోల్పోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవలి కాలంలో ఆకస్మిక మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. డ్యాన్స్ చేస్తూ, స్టేజ్‌పై నటిస్తూ, దేవుడికి దండం పెట్టుకుంటూ కూడా చాలా మంది అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్‌కు (Cardiac Arrest) గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి ఘటనలు ఎన్నో సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి ఆకస్మిక మరణాలకు, కరోనాకు (Corona) ఏమైనా సంబంధం ఉందా అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ఒక అధ్యయనాన్ని ప్రారంభించింది.

హఠాత్తుగా గుండె ఆగిపోయే ఘటనలు ఘణనీయంగా పెరగడానికి గల కారణం గురించి, వాటిల్లో కరోనా పాత్ర ఏదైనా ఉందా అని తెలుసుకోవడానికి వెర్బల్ శవపరీక్ష పద్ధతిని అవలంబిస్తున్నారు. కార్డియాక్ అరెస్ట్‌తో మరణించిన వ్యక్తిలో ఎలాంటి లక్షణాలు కనిపించాయి, ఏ పరిస్థితుల్లో మరణించాడు, అంతకుముందు ఏమైనా సమస్యలు ఉన్నాయా తదితర సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ అధ్యయనంలో కొంతమంది అగ్రశ్రేణి కార్డియాలజిస్టులు, AIIMS ఫోరెన్సిక్ నిపుణులు కూడా పాల్గొంటున్నారు. ఇటీవల హఠాత్తుగా చనిపోతున్న చాలా మందిలో కార్డియాక్ అరెస్ట్ కనిపించినట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కార్డియాక్ అరెస్ట్‌కు కరోనాకు (Covid-19) మధ్య గల సంబంధాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

గుండెపోటు (Heart Attack), కార్డియాక్ అరెస్ట్ ఒకటేనా?

సాధారణంగా గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ ఒకటే అని చాలా మంది అనుకుంటారు. కానీ, కాదు.. గుండెపోటు అంటే గుండెకు వెళ్లే రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడడం. కరోనరీ ధమనులలో (coronary arteries) ఒకటి బ్లాక్ అయినప్పుడు గుండెపోటు వస్తుంది. కానీ, కార్డియాక్ అరెస్ట్ అంటే హఠాత్తుగా గుండె పని చేయడం మానేయడం. ఒక వ్యక్తి కార్డియాక్ అరెస్ట్‌కు గురైతే అతడి గుండె ఇతర శరీర భాగాలకు రక్త సరఫరాను ఆపేస్తుంది. అలాగే శ్వాస తీసుకోవడం కూడా ఆగిపోతుంది. గుండెపోటు కంటే కార్డియాక్ అరెస్ట్ చాలా ప్రమాదకరం. కార్డియాక్ అరెస్ట్‌కు గురైన వ్యక్తి నిమిషాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోతాడు.

Updated Date - 2022-12-24T14:58:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising