Virat Kohli: విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం.. టీ20లకు బ్రేక్!

ABN , First Publish Date - 2022-12-27T21:07:21+05:30 IST

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli) షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. స్వదేశంలో శ్రీలంక(Sri Lanka)తో టీ20

Virat Kohli: విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం.. టీ20లకు బ్రేక్!

ముంబై: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli) షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. స్వదేశంలో శ్రీలంక(Sri Lanka)తో టీ20 సిరీస్ కోసం జట్టును ఎంపిక చేయడానికి ముందు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు ఓ వార్త జాతీయ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కోహ్లీ టీ20ల నుంచి బ్రేక్ తీసుకోబోతున్నాడన్నదే ఆ వార్త సారాంశం. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల నుంచి బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించిన విరాట్.. వన్డేలు, టెస్టుల్లో మాత్రం కొనసాగాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో కోహ్లీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకున్నప్పటికీ సోషల్ మీడియాతోపాటు ప్రధాన మీడియాలో వార్తలు కనిపిస్తున్నాయి. వన్డేలు, టెస్టులపై దృష్టి సారించేందుకే కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు.

టీ20లకు తాను అందుబాటులో ఉండబోనని కోహ్లీ తమకు సమాచారం ఇచ్చాడని బీసీసీఐ(BCCI) సీనియర్ అధికారి ఒకరు ‘ఇన్‌సైడ్ స్పోర్ట్’తో మాట్లాడుతూ పేర్కొన్నారు. వన్డేలకు మాత్రం తిరిగి అందుబాటులోకి వస్తాడని ఆయన పేర్కొన్నారు. అయితే, అతడు విశ్రాంతి తీసుకుంటున్నాడా? లేక, టీ20ల నుంచి మొత్తానికే బ్రేక్ తీసుకుంటున్నాడా? అన్న విషయంలో స్పష్టత లేదని అన్నారు. ముఖ్యమైన సిరీస్‌లపై కోహ్లీ దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు. ఇక, రోహిత్ శర్మ (Rohit Sharma) విషయానికి వస్తే అతడు ఫిట్‌గా ఉన్నాడా? లేదా? అన్నది గడువు లోపు తెలుస్తుందన్నారు. రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నా, ఫీల్డింగ్‌లో రిస్క్ తీసుకోకూడదని పేర్కొన్నారు.

అంతేకాదు, సెలక్షన్‌కు కోహ్లీ ఎప్పుడు అందుబాటులో ఉంటాడన్న విషయంలోనూ స్పష్టత లేదు. అయితే, ఐపీఎల్ 2023కి ముందు 34 ఏళ్ల కోహ్లీ టీ20లు ఆడబోడని తెలుస్తోంది. మరోవైపు, శ్రీలంకతో త్వరలో జరగనున్న టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదు. బొటనవేలి గాయం నుంచి రోహిత్ ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. అంతేకాదు, శ్రీలంకతో సిరీస్‌కు కేఎల్ రాహుల్ (KL Rahul) కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో భారత జట్టుకు హార్దిక్ పాండ్యా (Hardik Pandya) సారథ్యం వహించే అవకాశం ఉంది.

శ్రీలంకతో సిరీస్ ఇలా..

తొలి టీ20 జనవరి 3న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. రెండో మ్యాచ్ జనవరి 5న పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో, చివరిదైన మూడో మ్యాచ్ జనవరి 7న రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతుంది.

Updated Date - 2022-12-27T21:10:59+05:30 IST