ICC Mens T20 World Cup 2022: దాయాదుల పోరు.. టాస్ గెలిచిన భారత్
ABN , First Publish Date - 2022-10-23T13:22:38+05:30 IST
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మరికాసేపట్లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన టీమిండియా
మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మరికాసేపట్లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన టీమిండియా సారథి రోహిత్ శర్మ మరోమాటకు తావులేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా ట్రోఫీ కోసం జర్నీ ప్రారంభించాలని భారత్ పట్టుదలగా ఉంది. దీనికి తోడు గతేడాది పాక్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ కసిగా ఉంది. పాకిస్థాన్ కూడా అంతే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా ప్రపంచకప్‌లో భారత రికార్డుకు చెక్ పెట్టాలని భావిస్తోంది. ఇక భారత తుది జట్టులో అనుకున్నట్టుగానే దినేశ్ కార్తీక్, మహ్మద్ షమీలకు చోటు లభించింది.
టాస్ అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ ఆజం మాట్లాడుతూ.. భారత్ ఎదుట 160-170 పరుగుల లక్ష్యాన్ని ఉంచేందుకుప్రయత్నిస్తామని అన్నాడు. న్యూజిలాండ్‌లో ముక్కోణపు టోర్నీ ఆడొచ్చాం కాబట్టి అదిప్పుడు బాగా పనిచేస్తుందని అన్నాడు. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నట్టు చెప్పాడు. ఇక భారత జట్టు ఏడుగురు బ్యాటర్లు, మ్గురు సీమర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోంది.