ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేయాలి

ABN, First Publish Date - 2022-12-21T22:44:28+05:30

ఆక్రమణదారుల నుంచి ప్రభుత్వ భూములను కాపాడి పేదలకు పంపిణీ చేయాలని సీపీఐ పట్టణ కార్యదర్శి ఖలిందర్‌ఖాన్‌ కోరారు. జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తానుంచి బుధవారం తహసీల్దార్‌ కార్యాలయం వరకూ ర్యాలీఽ నిర్వహించి ధర్నా చేపట్టారు.

మంచిర్యాలలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జిల్లావ్యాప్తంగా తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట ధర్నా

మంచిర్యాల కలెక్టరేట్‌, డిసెంబరు 21: ఆక్రమణదారుల నుంచి ప్రభుత్వ భూములను కాపాడి పేదలకు పంపిణీ చేయాలని సీపీఐ పట్టణ కార్యదర్శి ఖలిందర్‌ఖాన్‌ కోరారు. జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తానుంచి బుధవారం తహసీల్దార్‌ కార్యాలయం వరకూ ర్యాలీఽ నిర్వహించి ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్‌ రాజేశ్వర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాలలో నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్లను అర్హులకు వెంటనే కేటాయించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాటాప్రకారం సొంత భూములు ఉన్న పేదలకు రూ.3లక్షల రూపాయలను అందజేయాలన్నారు. భూమిలేని నిరుపేదల ఇంటినిర్మాణానికి 150 గజాలస్థలాన్ని, నిర్మాణ ఖర్చును 10లక్షల రూపాయలకు పెంచి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్ర మంలో జిల్లా, పట్టణ నాయకులు చాడమహేందర్‌ రెడ్డి, బియ్యాల రాజేశం, కోడి వెంక టేశం, యాదగిరి, కనకలక్ష్మి, సరస్వతి, ఆరెందులక్ష్మి, గాజుల రవికుమార్‌, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

నస్పూర్‌: నస్పూర్‌ మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ భారత కమ్యునిస్టు పార్టీ (సీపీఐ)ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్‌ జ్యోతికి అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు కారుకూరి నగేష్‌, నాయకులు లింగం రవి, మిర్యాల రాజేశ్వర్‌రావు, మోతుకూరి కొమురయ్య, రాగిడి రాజు, నర్సింగరావు, సాయి, సంతోష్‌, తదితరులు పాల్గొన్నారు.

లక్షెట్టిపేట: మండలంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో సీపీఐ నాయకులు తహసీ ల్దార్‌ జ్యోతికి వినతి పత్రం అందజేశారు. కార్యక్ర మంలో పార్టీ సహాయ కార్య దర్శి రమణారెడ్డి, రైతు సంఘం అధ్యక్షుడు ఆకుల రామన్న, సీపీఐ మండల ఉపాధ్య క్షుడు భానుచందర్‌, సత్తన్న, రాజన్న, ఐలయ్య, మల్లేష్‌ పాల్గొన్నారు.

బెల్లంపల్లి: పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రేగుంట చంద్రశేఖర్‌ మాట్లాడారు. నిరుపేదలకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు, ఇళ్ల స్థలాలు, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు బొల్లం పూర్ణిమ, చిప్ప నర్సయ్య, పట్టణ కార్యదర్శి శ్రీధర్‌, నాయకులు చంద్రమాణిక్యం, లక్ష్మీనారాయణ, రాజమౌళి, శంకర్‌, సరోజ, సోని, రాంచందర్‌, లింగయ్య, శంకర్‌గౌడ్‌, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

తాండూర్‌: తాండూర్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ ఇన్‌చార్జి రేగుంట చంద్రశేఖర్‌, నియోజకవర్గ సహాయ కార్యదర్శి మామిడాల రాజేశ్‌, మండల కార్యదర్శి సంతోష్‌, నాయకులు మల్లయ్య, జహంగీర్‌ తదితరులు పాల్గొన్నారు.

మందమర్రిరూరల్‌: ఎన్నికల సమయంలో కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఐ జిల్లాకార్యవర్గసభ్యులు మిట్టపల్లి శ్రీనివాస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం మండల తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి కామెర దుర్గరాజ్‌, సీపీఐ పార్టీ జిల్లా సమితి సభ్యులు వనం సత్యనారాయణ, నక్క వెంకటస్వామి, మెరుగు రాజేశం, బండారి రాజేశం తదితరులు పాల్గొన్నారు.

కాసిపేట: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సీపీఐ నాయకులు తహసీల్దార్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం తహసీల్దార్‌ దిలీప్‌కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి గట్టు సర్వేశం, నాయకులు దాడి గట్టయ్య, గోనె సత్యం, పులి శంకర్‌, దుర్గం సుధాకర్‌, దాగం రాజలింగు, దుర్గం పోశం, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-21T22:44:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising