వచ్చే నెల 8 వరకు ఓటర్ల సంక్షిప్త సవరణ తుది జాబితా
ABN, First Publish Date - 2022-11-11T00:39:51+05:30
ఎన్నికల సంఘం ఆదేశం మేరకు ఈ నెల 9 నుంచి వచ్చే నెల 8 వరకు ఓటర్ల జాబితా ప్రత్యేకసంక్షిప్త సవరణ కార్యక్రమం జిల్లాలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ ఒక ప్రకటనలో తెలిపారు.
నిర్మల్ కల్చరల్, నవంబరు 10 : ఎన్నికల సంఘం ఆదేశం మేరకు ఈ నెల 9 నుంచి వచ్చే నెల 8 వరకు ఓటర్ల జాబితా ప్రత్యేకసంక్షిప్త సవరణ కార్యక్రమం జిల్లాలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ ఒక ప్రకటనలో తెలిపారు. 2023 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన పౌరులను ఓటర్లుగా నమోదు చేయడం జరిగిందన్నారు. జనవరి 5న తుది జాబితా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచురిస్తారని తెలిపారు. తుది జాబితా ప్రకారం ఖానాపూర్‌లో 99,367 మంది పురుషులు, 102903 మంది మహిళలు, ఇతరులు 10 మందితో కలిపి 2,02,280 మంది ఓటర్లున్నారని తెలిపారు. నిర్మల్‌లో 109026 మంది పురుషులు, 121131 మంది మహిళలు, 15 మంది ఇతరులు మొత్తం 230172 ఓటర్లున్నారని పేర్కొన్నారు. ముథోల్‌లో 110796 మంది పురుషులు, 115910 మహిళలు, 19 ఇతరులు మొత్తం 226725 ఓటర్లున్నారని జిల్లాలో మొత్తం 659177 ఓటర్లున్నారని విరించారు. డిసెంబరు 8 వరకు అభ్యంతరాలు స్వీకరించడం, నవంబరు 26, 27, డిసెంబరు 10, 12న నమోదు ఉంటుందని, ఇందుకోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు. డిసెంబరు 26లోగా అభ్యంతరాలు, ఓటరు క్లైమ్‌లు పూర్తి స్థాయిలో పరిష్కరించి తుది జాబితాను 2023 జనవరి 5న ప్రచురించనున్నట్లు తెలిపారు.
Updated Date - 2022-11-11T00:39:53+05:30 IST