ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Heroine Samantha : సమంతకు మయోసైటిస్‌

ABN, First Publish Date - 2022-10-30T05:49:59+05:30

ప్రముఖ హీరోయిన్‌ సమంత అరుదైన కండరాల వ్యాధి ‘మయోసైటి్‌స’తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో శనివారం వెల్లడించారు. కొన్ని నెలల నుంచి

Samantha
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అరుదైన కండరాల వ్యాధి బారిన అగ్ర తార

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించిన నటి

సెలైన్‌తో.. డబ్బింగ్‌ చెబుతున్న ఫొటో షేర్‌

కోలుకుంటున్నట్లు సమంత వెల్లడి

మాయదారి మయోసైటిస్‌

విపరీతమైన అలసట, నొప్పులు లక్షణాలు

నడుస్తూ ఉండగానే పడిపోయే ప్రమాదం

కూర్చుంటే లేవలేరు.. లేస్తే కూర్చోలేరు

రోగుల్లో మహిళలు, పిల్లలేఅధికులు!

రుమటాలజిస్టుల వద్దకు రోజుకో కేసు

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ హీరోయిన్‌ సమంత అరుదైన కండరాల వ్యాధి ‘మయోసైటి్‌స’తో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో శనివారం వెల్లడించారు. కొన్ని నెలల నుంచి ఆ వ్యాధికి చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని, పూర్తిస్థాయిలో కోలుకోవడానికి సమయం పడుతుందన్నారు. 35 ఏళ్ల సమంత అనారోగ్యంపై కొన్ని రోజులుగా కథనాలు వస్తున్నాయి. వీటిపై ఇప్పటివరకు ఆమె నేరుగా స్పందించలేదు. తాజాగా ఆమె నటించిన ‘యశోద’ సినిమాకు డబ్బింగ్‌ చెబుతూ.. చేతికి సైలైన్‌తో ఉన్న ఫొటోను షేర్‌ చేశారు. ‘‘నేను మయోసైటి్‌సకు గురైనట్లు కొన్ని నెలల కిందట తెలిసింది. కోలుకున్నాక మీ అందరికీ చెప్పాలని భావించాను. త్వరలో కోలుకుంటానని నమ్మకం ఉంది’’ అని సమంత పోస్ట్‌ చేశారు.

మాయదారి మయోసైటిస్‌

మయోసైటిస్‌.. ఇదో మయాదారి జబ్బు. దీనిని గుర్తించడం కొంచెం కష్టం. ఈ వ్యాధి లక్షణాలతో తమ వద్దకు రోజుకొకరు వస్తున్నట్లు రుమటాలజిస్టులు వెల్లడించారు. సమంత మయోసైటి్‌సతో బాధపడుతున్నట్లు ప్రకటించడంతో అసలేమిటీ వ్యాధి అనే చర్చ జరుగుతోంది. ఇది కండరాల వాపునకు సంబంధించిన జబ్బు, ఎక్కువగా మహిళలు, చిన్న పిల్లల్లో వస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున ఆరోగ్యకర కణజాలం మీద దాడి చేయడం (ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్‌) వల్ల ఈ వ్యాధికి గురవుతారని, దీనిలో పాలి, డెర్మటో, ఇన్‌క్లూజన్‌ బాడీ మయోసైటిస్‌ వంటి పలు రకాలున్నాయని తెలిపారు. ‘పాలి మయోసైటిస్‌ బాధితులు ఏ కాస్త చిన్న పనిచేసినా నీరసానికి గురవుతారు. కండరాలు విపరీతంగా నొప్పి పెడతాయి. అకస్మాత్తుగా కిందపడిపోతారు. మోకాలిపై భాగం, భుజం పైభాగం, తుంటి చుట్టూ, పిరుదులు, తొడలు బలహీనంగా మారుతాయి.

కింద కూర్చోలేరు, కూర్చున్నా లేవలేరు, జబ్బు తీవ్రత పెరిగితే కూర్చోలేని, నిలబడలేని పరిస్థితికి చేరకుంటార’ని వైద్యులు వివరించారు. డెర్మటో మయోసైటి్‌సతో దద్దుర్లు వస్తాయి. కళ్లు ఉబ్బుతాయి. ముఖంలో వాపు కనిపిస్తుంది. ఇన్‌క్లూజన్‌ బాడీ మయోసైటి్‌సతో నీరసంతో పాటు పిరుదులు, తొడ, ముంజేయి, మోకాలి కండరాలు పట్టేసి, నొప్పిగా ఉంటాయి. రుమటాలజిస్టుల వద్దకు వచ్చే వారిలో 5-15, 45-60 ఏళ్ల వయస్కులు ఎక్కువగా ఉంటున్నారు. వంశపారంపర్యంగా, కొన్ని రకాల మందులు, స్టెరాయిడ్స్‌తో మయోసైటి్‌సకు గురయ్యే అవకాశం ఉంది. కొన్ని రకాల వైరస్‌ వల్ల కూడా వస్తుందని వైద్యులు తెలిపారు. ఇలాంటివారిలో కండరాల నొప్పులు ఎక్కువగా ఉంటాయి.

భావోద్వేగంతో పోస్టు

తన అనారోగ్యం గురించి చెబుతూ.. సమంత భావోద్వేగంగా వేదాంత ధోరణిలో పోస్ట్‌ చేశారు. ‘‘ఎన్నో మంచి, చెడు రోజులను చూశాను. ఇకపై ఇలాంటివాటిని ఒక్క రోజు కూడా భరించలేననే సందర్భాలను ఎదుర్కొన్నాను. ప్రతిసారీ దృఢంగా వెళ్లలేమని తెలిసింది. అయితే, అదంతా గతం. అన్నిటినీ భరిస్తూనే ముందుకెళ్తా. ఈ కష్టాన్ని కూడా దాటుతా. జీవితం విసిరే అంతులేని సవాళ్లను అధిగమించడానికి మీ ప్రేమ నాకు బలాన్ని ఇస్తుంది’’ అని అందులో పేర్కొన్నారు.

ఇలా చేయాలి

కండరాలను బలపేతం చేసే వ్యాయామాలు చేయాలి. మానసిక ఒత్తిళ్లకు లోనుకాకూడదు. కణాలు పూర్తిగా దెబ్బతినకుండా జాగ్రత్తపడాలి. ఎలకో్ట్రమయోగ్రాఫీ (ఈఎంజీ) పరీక్షలు చేయించుకోవాలి. ఈ ఫలితాలు సాధారణంగా ఉంటే ఎంఆర్‌ఐ, మజిల్స్‌ బయాప్సీతో నిర్ధారణ చేసుకోవాలి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, స్టెరాయిడ్స్‌, ఇమ్యునో సప్ర్పెసెంట్‌, ఇమ్యూనోగ్లోబిన్స్‌ మందులు ఇవ్వాల్సి ఉంటుంది.

డాక్టర్‌ శరత్‌ చంద్రమౌళి, రుమటాలజీ విభాగం డైరెక్టర్‌,

డాక్టర్‌ రాజీవ్‌, సీనియర్‌ రెసిడెంట్‌, ఛాతీ ఆస్పత్రి

Updated Date - 2022-10-30T06:29:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising