COVID: కరోనా బీఎఫ్.7 వేరియంట్‌పై తెలంగాణ సర్కార్ హైఅలర్ట్
ABN , First Publish Date - 2022-12-22T21:38:43+05:30 IST
కరోనా (corona) బీఎఫ్-7 వేరియంట్‌పై తెలంగాణ సర్కార్ హైఅలర్ట్ అయింది.
హైదరాబాద్: కరోనా (corona) బీఎఫ్-7 వేరియంట్‌పై తెలంగాణ సర్కార్ హైఅలర్ట్ అయింది. అధికారులతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు (Minister Harish Rao) సమీక్షించారు. కరోనాపై ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉందామని హరీష్‌రావు తెలిపారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని, కొవిడ్ టెస్టులు, బూస్టర్ డోస్‌ల ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చారు. కరోనా పాజిటివ్ వచ్చిన శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్స్ కోసం గాంధీ ఆస్పత్రికి పంపాలని హరీష్‌రావు స్పష్టం చేశారు.