ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayashanthi: అలా చేయకుంటే.. కేసీఆర్ సర్కార్ చరిత్రలో కలిసిపోవడం ఖాయం

ABN, First Publish Date - 2022-11-17T20:35:49+05:30

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)పై బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) విమర్శలు గుప్పించారు

విజయశాంతి, బీజేపీ నాయకురాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)పై బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) విమర్శలు గుప్పించారు. స్పౌజ్ బదిలీలు చేయకుండా కేసీఆర్ సర్కార్ ఉపాధ్యాయులును అనేక ఇబ్బందుల‌కు గురిచేస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా రోజుల నుంచి వివిధ‌ రూపాల్లో స్పౌజ్ బదిలీల కోసం పోరాడుతున్న ఉపాధ్యాయ దంపతులకు ఎదురుచూపులే మిగులుతున్నాయని ఆమె మండిపడ్డారు. రాములమ్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు యథాతథంగా..

'' స్పౌజ్ బదిలీలు చేయక ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం... తెలంగాణ‌లో కెసిఆర్ సర్కార్ ఉపాధ్యాయులును అనేక ఇబ్బందుల‌కు గురిచేస్తుంది. వారు చాలా రోజుల నుంచి వివిధ‌ రూపాల్లో స్పౌజ్ బదిలీల కోసం పోరాడుతున్న ఉపాధ్యాయ దంపతులకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉత్తర్వు నెంబర్ 317 ద్వారా బదిలీ అయి వేర్వేరు ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయ దంపతులకు సంబంధించి స్పౌజ్ బదిలీలపై విద్యాశాఖ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. భార్య ఒక జిల్లాలో, భర్త మరో జిల్లాలో, పిల్లలు ఎవరితో ఉండాలో, ఎక్కడ చదువుకోవాలో, వారు ఏ జిల్లా పరిధిలోకి వస్తారో తెలియని మానసిక ఒత్తిడిలో స్పౌజ్ ఉపాధ్యాయులు నలిగిపోతున్నారు. నూతన జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ప్రభుత్వం నిరుడు డిసెంబర్ లో క్యాడర్ వారీగా ఉపాధ్యాయులను సీనియార్టీ ఆధారంగా బదిలీలు చేసింది. ఈ క్రమంలో దాదాపు 5000 మంది భార్యాభర్తలు వేర్వేరు జిల్లాలకు బదిలీ అయ్యారు.19 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం 13 జిల్లాలను బ్లాక్ లో పెట్టడంతో దాదాపు 2069 మంది ఉపాధ్యాయులు గత 8 నెలలుగా వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తున్నా, ప్రభుత్వం కనికరించడం లేదు. ఇప్పటికైనా స్పౌజ్ బదిలీలను చేపట్టాలని బిజెపి తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగులతో పెట్టుకున్న ఏ సర్కార్ కూడా నిలబడినట్టు చరిత్రలో లేదు. తొందర్లోనే ఈ కేసీఆర్ సర్కార్ కూడా చరిత్రలో కలిసిపోవడం ఖాయం''. అని విజయశాంతి అన్నారు

Updated Date - 2022-11-17T20:44:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising