Jeevan Reddy: ఆడబిడ్డ మీద దాడులు సరికాదు
ABN , First Publish Date - 2022-11-29T14:32:40+05:30 IST
పాదయాత్రలో వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలపై దాడిని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
జగిత్యాల: పాదయాత్రలో వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల (YS Sharmila)పై దాడిని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) తీవ్రంగా ఖండించారు. ఆడబిడ్డ మీద దాడులు చేయడం సరికాదన్నారు. శాంతియుతంగా యాత్రలు చేస్తే అడ్డుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఆడబిడ్డ పార్టీకి అధ్యక్షురాలుగా ఉండకూడదా... యాత్రలు చేయొద్దా అని జీవన్ రెడ్డి(MLC) ప్రశ్నించారు.