ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కంటి వెలుగు’కు ప్రణాళిక సిద్ధం

ABN, First Publish Date - 2022-12-28T23:09:20+05:30

జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి జిల్లా అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. జనవరి 18 నుంచి కార్యక్రమం ప్రారంభం కానున్నది.

జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- వచ్చేనెల 18 నుంచి ప్రారంభం

- 18 ఏళ్లు నిండిన వారందరికీ పరీక్షలు

- వైద్య పరీక్షలు చేసేందుకు 25 బృందాలు

గద్వాల క్రైం, డిసెంబరు 28 : జిల్లాలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి జిల్లా అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. జనవరి 18 నుంచి కార్యక్రమం ప్రారంభం కానున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో 2011 లెక్కల ప్రకారం దాదాపు 6,83,000 మంది జనాభా ఉంది. వారిలో 18 సంవత్సరాలు పైబడిన వారికి కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. జనవరి 18 నుంచి వంద రోజుల పాటు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లద్దాలు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

255 గ్రామపంచాయతీలు, 77 వార్డులు

జిల్లాలోని 255 గ్రామపంచాయతీల్లో, మునిసిపాలి టీల్లోని 77 వార్డుల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు 25 ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. ప్రతీ బృందంలో ఒక మెడికల్‌ అధికారి, కంటి నిపుణులు, డాటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉంటారు. వారితో పాటు ఒక సూపర్‌వైజర్‌, ఇద్దరు ఏఎన్‌ఎంలు, ముగ్గురు ఆశ కార్యకర్తలు కూడా ఉంటారు.

అవసరమైన వారికి నెలలోపు కళ్లద్దాలు

డాక్టర్‌ సిద్ధప్ప, డిప్యూటీ డీఎంహెచ్‌వో : కంటవెలుగు కార్యక్రమంలో భాగంగా అర్హులైన వారికి నెలలోపు కళ్లద్దాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. కంటి పరీక్షలు నిర్వహించేందుకు బృందాలను సిద్ధం చేశారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం సాధారణ సమస్య (రీడింగ్‌ ప్రాబ్లం) ఉన్న వారికి వెంటనే అద్దాలు ఇవ్వడానికి కృషి చేస్తాం. సమస్య ఎక్కువగా ఉన్న వారికి (రెండు కళ్లకు వేర్వేరుగా చూపు సమస్య) ఉన్నవారికి నెలలోపు అద్దాలు అందేలా చూస్తాం.

Updated Date - 2022-12-28T23:09:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising