Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ డీల్ కేసు... హైకోర్టు కీలక నిర్ణయం
ABN, First Publish Date - 2022-11-08T20:24:56+05:30
తెలంగాణ (Telangana) రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫాంహౌస్ డీల్ కేసు (Moinabad Farmhouse Case)కు సంబంధించి.. తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్: తెలంగాణ (Telangana) రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫాంహౌస్ డీల్ కేసు (Moinabad Farmhouse Case)కు సంబంధించి.. తెలంగాణ హైకోర్టు (Telangana High Court) కీలక నిర్ణయం తీసుకుంది. ఫామ్‌హౌస్ డీల్ కేసులో దర్యాప్తుపై హైకోర్టు స్టే ఎత్తివేసింది. మొయినాబాద్ పోలీసులు దర్యాప్తు చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. సీబీఐతో దర్యాప్తు చేయించాలన్న బీజేపీ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు పెండింగ్‌లో పెట్టింది. తదుపరి విచారణ ఈనెల 18కి హైకోర్టు వాయిదా వేసింది.
కాగా ఢిల్లీకి చెందిన రామచంద్రభారతి, ఏపీకి చెందిన సింహయాజీ, హైదరాబాద్‌కు (Hyderabad) చెందిన నందకుమార్.. తమను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని.. తాండూర్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రోహిత్ రెడ్డి (Pilot Rohit Reddy) ఫామ్‌హౌస్‌లో ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేసింది. అయితే.. ఎమ్మెల్యేల ప్రలోభాల ఇష్యూకు.. బీజేపీ సంబంధం ఉందని ఆరోపణలు వచ్చాయి. దీంతో సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్ చేస్తుంది.
Updated Date - 2022-11-08T20:34:22+05:30 IST