Malotu kavita: బయ్యారం ఉక్కుపై కిషన్ రెడ్డి ప్రకటన సిగ్గుచేటు

ABN , First Publish Date - 2022-09-27T19:53:32+05:30 IST

బయ్యారం ఉక్కుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటన సిగ్గుచేటని ఎంపీ మాలోతు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Malotu kavita: బయ్యారం ఉక్కుపై కిషన్ రెడ్డి ప్రకటన సిగ్గుచేటు

హైదరాబాద్: బయ్యారం ఉక్కు (Bayyaram steel)పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan reddy) ప్రకటన సిగ్గుచేటని ఎంపీ మాలోతు కవిత (Malothu kavitha) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... కిషన్ రెడ్డి అసలు ఈ రాష్ట్రంలోనే పుట్టారా?  అని ప్రశ్నించారు. బయ్యరం ఉక్కుపై  చేసిన ప్రకటనతో తెలంగాణ మీద కిషన్ రెడ్డి(Union minister)కి ప్రేమ లేదని తేలిపోయిందని అన్నారు. సంక్రాంతి పండగ ముందు వచ్చే బుడబుక్కల వాళ్లలా బీజేపీ నేతలు(BJP leaders) వస్తున్నారని యెద్దేవా చేశారు. గిరిజనులు అంటే తమకు గిట్టదా.. గిరిజనుల ఆశలకు ఉరి వేశారని... గిరిజనులే బీజేపీ (BJP)ని పాతర వేస్తారని హెచ్చరించారు. కిషన్ రెడ్డి ఒక్క ప్రకటనతో దద్దమ్మ అని తేలిపోయిందన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని ఎంపీ మాలోతు కవిత (TRS MP) డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-09-27T19:53:32+05:30 IST