తిమ్మాపూర్‌ గ్రామాన్ని దత్తత తీసుకున్న ది కశ్మీర్‌ ఫైల్స్‌ నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌

ABN , First Publish Date - 2022-10-31T03:38:16+05:30 IST

కార్తికేయ-2 వంటి విజయవంతమైన చిత్రాల నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.

తిమ్మాపూర్‌ గ్రామాన్ని దత్తత తీసుకున్న   ది కశ్మీర్‌ ఫైల్స్‌ నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌
Abhishek Agarwal

హైదరాబాద్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): కార్తికేయ-2 వంటి విజయవంతమైన చిత్రాల నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్‌ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అగర్వాల్‌తో పాటు ఆయన కుటుంబీకులు చంద్రకళ ఫౌండేషన్‌ అనే స్వచ్ఛంద సంస్థ పేరిట ప్రజాసేవ చేస్తున్నారు. ఈ క్రమంలో.. తన తండ్రి తేజ్‌నారాయణ్‌ అగర్వాల్‌ 60వ జన్మదినం, తన అమ్మమ్మ చంద్రకళ 90వ జయంతి సందర్భంగా తిమ్మాపూర్‌ గ్రామాన్ని అభిషేక్‌ దత్తత తీసుకున్నారు. చంద్రకళ ఫౌండేషన్‌ 3వ సార్థక్‌ దివస్‌ హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అభిషేక్‌ అగర్వాల్‌, ఆయన తండ్రి తేజ్‌నారాయణ అగర్వాల్‌, నటుడు అనుపమ్‌ ఖేర్‌, దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి, క్రీడాకారిణి పీవీ సింధు తదితరులు పాల్గొన్నారు. కాగా.. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి జన్మస్థలం తిమ్మాపూర్‌ కావడం విశేషం.

Updated Date - 2022-10-31T03:38:18+05:30 IST