Avinash Reddy : అవినాష్ రెడ్డి వాహనాన్ని అనుసరిస్తున్న ఏబీఎన్ వాహనం, రిపోర్టర్‌పై దాడి

ABN , First Publish Date - 2023-05-19T12:13:27+05:30 IST

వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి నేడు విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. తల్లి అనారోగ్యం కారణం చెప్పి ఆయన పులివెందులకు బయలు దేరారు. అయితే ఆయన వాహన్ని అనుసరిస్తున్న ఏబీఎన్ వాహనం, రిపోర్టర్‌పై అవినాష్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. వాహనం ముందు వైపు అద్దాలు పగులగొట్టి.. ఏబీఎన్ రిపోర్టర్ శశిపై అవినాష్ అనుచరులు దాడికి పాల్పడ్డారు.

Avinash Reddy : అవినాష్ రెడ్డి వాహనాన్ని అనుసరిస్తున్న ఏబీఎన్ వాహనం, రిపోర్టర్‌పై దాడి

హైదరాబాద్ : వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి నేడు విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. తల్లి అనారోగ్యం కారణం చెప్పి ఆయన పులివెందులకు బయలు దేరారు. అయితే ఆయన వాహన్ని అనుసరిస్తున్న ఏబీఎన్ వాహనం, రిపోర్టర్‌పై అవినాష్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. వాహనం ముందు వైపు అద్దాలు పగులగొట్టి.. ఏబీఎన్ రిపోర్టర్ శశిపై అవినాష్ అనుచరులు దాడికి పాల్పడ్డారు.

తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి మళ్లీ ట్విస్ట్ ఇచ్చారు. గత విచారణ సమయంలో ట్విస్ట్ ఇచ్చిన మాదిరిగానే.. నేడు కూడా అదే ట్విస్ట్ ఇవ్వడం గమనార్హం. సీబీఐ కార్యాలయానికి బయలుదేరినట్టే బయల్దేరి.. మార్గమధ్యలోనే హుటాహుటిన ఆయన పులివెందుల దారి పట్టారు. ఎంపీ తల్లి శ్రీలక్ష్మి అనారోగ్యంతో పులివెందుల ఆసుపత్రిలో చేరారని ఫోన్ రావడంతో ఆయన పులివెందులకు బయలుదేరారు. కాగా శ్రీలక్ష్మికి గుండెపోటు వచ్చినట్లుగా తెలుస్తోంది.

వాస్తవానికి.. ఉదయం నుంచి కూడా అవినాష్ రెడ్డి విచారణకు హాజరవుతారా.. లేదా? అనేది సందిగ్ధంగానే ఉంది. విచారణకు హాజరు కావాల్సిన సమయం ఆసన్నమైనా కూడా ఆయన తన న్యాయవాదులతో విచారణకు వెళ్లాలా.. వద్దా.. అనేదానిపై చర్చలు నిర్వహిస్తూ ఉండిపోయారు. చర్చలు ముగిశాక వెంటనే తన కాన్వాయ్‌లో బయలు దేరారు. మీడియా మొత్తం ఆయన సీబీఐ కార్యాలయానికే బయల్దేరారనే అనుకుంది. కానీ ఆయన పులివెందుల వైపునకు రూటు పట్టారు. గత విచారణ సమయం(ఈ నెల 16న)లోనూ అవినాష్ రెడ్డి అలాగే చేశారు. విచారణకు హాజరవుతున్నట్టుగా కారులో బయలుదేరి వెంటనే పులివెందుల దారి పట్టారు. ఈ పరిస్థితుల్లో సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..? అనేదానిపై సర్వత్రా అవినాష్ అనుచరుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Updated Date - 2023-05-19T12:15:34+05:30 IST