ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కలిసి నడుద్దాం..!

ABN, First Publish Date - 2023-11-15T00:18:59+05:30

అనంతపురం అర్బన నియోజకవర్గం టీడీపీ, జనసేన నేతలు సమష్టి గళాన్ని వినిపించారు. అరాచక వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా ఏకతాటిపై సాగుదామని, అనంతపురం అర్బనలో టీడీపీ, జనసేన జెండా ఎగరేద్దామని రెండు పార్టీల శ్రేణులకు పిలుపునిచ్చారు.

సమన్వయ కమిటీ సమావేశానికి హాజరైన టీడీపీ నాయకులు

అరాచక వైసీపీని గద్దెదింపుదాం

అర్బనలో టీడీపీ, జనసేన జెండా ఎగరేద్దాం

ఉమ్మడి మినీ మేనిఫెస్టోనే ప్రధాన అజెండా

ఆత్మీయ సమావేశంలో టీడీపీ, జనసేన తీర్మానం

అనంతపురం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి):

అనంతపురం అర్బన నియోజకవర్గం టీడీపీ, జనసేన నేతలు సమష్టి గళాన్ని వినిపించారు. అరాచక వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా ఏకతాటిపై సాగుదామని, అనంతపురం అర్బనలో టీడీపీ, జనసేన జెండా ఎగరేద్దామని రెండు పార్టీల శ్రేణులకు పిలుపునిచ్చారు. జెండాలు వేరైనా అజెండా ఒక్కటేనని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేనాని పవన కల్యాణ్‌ సారథ్యంలో రూపొందించిన 11 అంశాల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ నెల 17 నుంచి ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్లేవిధంగా కార్యాచరణ రూపొందించారు. టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని, వైసీపీ స్థానిక ఎమ్మెల్యే, ఆ పార్టీ ప్రజాప్రతినిధుల అవినీతిని, ప్రజలకు చేసిన మోసాలను ఎండగడదామని తీర్మానించారు. గుత్తి రోడ్డులోని ఓ ఫంక్షన హాలులో అర్బన నియోజకవర్గ టీడీపీ, జనసేన ఆత్మీయ సమన్వయ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. టీడీపీ అర్బన నియోజకవర్గ ఇనచార్జి, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి, జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రెండు పార్టీల నాయకులు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు.

వైసీపీని గద్దెదింపడమే లక్ష్యం...

రానున్న ఎన్నికల్లో వైసీపీని గద్దెదింపడమే టీడీపీ, జనసేన ఉమ్మడి లక్ష్యం. వైసీపీ ప్రజావ్యతిరేక విధానాలను ఉమ్మడిగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించాం. అర్బన ఎమ్మెల్యే స్థానంతోపాటు ఎంపీ స్థానానికి అత్యధిక మెజార్టీ ఓట్లు సాధించేందుకు కలిసికట్టుగా ముందుకు వెళతాం. స్థానికంగా వైసీపీ నాయకుల అరాచకాలు, దాష్టీకాలను ఎదుర్కొనేందుకు సమష్టిగా పోరాడుతాం. ఈ నెల 17వ తేదీ నుంచి బాబు ష్యూరిటీతోపాటు జనసేన మినీ మేనిఫెస్టోను ఇంటింటికి తీసుకువెళతాం. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు జరిగిన అన్యాయం, స్థానిక సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరిస్తాం. రాబోవు రోజుల్లో టీడీపీ, జనసేన కూటమి ద్వారా ఏం చేస్తామనే అంశాలను ప్రజలకు తెలియజేసి చైతన్యం నింపుతాం. సోషల్‌ మీడియా ద్వారా వైసీపీ సృష్టిస్తున్న అపోహలు, మతాలు, పార్టీల మధ్య దురుద్దేశంతో రేకెత్తిస్తున్న విద్వేషాలను తిప్పికొడతాం. అక్రమ కేసులను ఎదుర్కొనేందుకు రెండు పార్టీల తరపున న్యాయవాదులను సమన్వయం చేసుకొని ముందుకు వెళతాం. అధికార పార్టీ నాయకులు రూ.కోట్లాది విలువైన భూములను అన్యాక్రాంతం చేశారు. వాటిని సాక్షాధారాలతో ప్రజల్లో ఎండగడతాం. హెచ్చెల్సీ కాలనీలో వైసీపీ జిల్లా కార్యాలయం కోసం రెండు ఎకరాలను ఏడాదికి రూ.1000 లీజుతో ప్రభుత్వ భూమిని కేటాయించడం దుర్మార్గం. వైసీపీ భూ అన్యాక్రాంతాలపై ఉమ్మడిగా పోరాటం చేస్తాం. జగన ప్రభుత్వాన్ని గద్దెదింపే వరకు పోరాటం ఆగదు.

- వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి, మాజీ ఎమ్మెల్యే

వైసీపీ జెండాను దింపడమే ధ్యేయం

రానున్న ఎన్నికల్లో వైసీపీ జెండాను దింపడమే జనసేన, టీడీపీ కూటమి ధ్యేయం. రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో అనంత అర్బనలో టీడీపీ, జనసేన కూటమి జెండా ఎగరేయడం ఖాయం. ఈ నెల 17వ తేదీ నుంచి ఉమ్మడిగా ఇంటింటికీ వెళ్లి టీడీపీ, జనసేన మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తాం. వైసీపీ దొంగ ఓట్ల కుట్రను తిప్పికొడతాం. టీడీపీ నాయకులతో కలిసి అర్బనలో రోడ్ల దుస్థితిని ఎత్తిచూపుతాం. అవినీతిని ఎండగడతాం. స్థానిక ఎమ్మెల్యే, ఆ పార్టీ నాయకుల అన్యాయాలు, అరాచకాలు, ప్రజలకు చేసిన మోసాలను ఎత్తి చూపుతాం.

- టీసీ వరుణ్‌, జనసేన జిల్లా అధ్యక్షుడు

సమన్వయంతో ముందుకు..

జనసేన రాష్ట్ర అధ్యక్షుడు పవనకల్యాణ్‌, టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయాల మేరకు జిల్లాలో సమన్వయంతో ముందుకు వెళతాం. రెండు పార్టీల్లో చిత్తశుద్ధితో పనిచేసే నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఇదే సందర్భంలో కొన్ని కలుపు మొక్కలు ఉన్నాయి. ఇలాంటివారు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేసుకుంటూ, రెండు పార్టీల నాయకులపై బురదజల్లడమే పనిగా పెట్టుకుంటున్నాయి. వాటిని ఎవరూ ఖాతరు చేయొద్దు. రానున్న ఎన్నికల్లో అనంత అర్బనలో టీడీపీ, జనసేన జెండా ఎగిరే విధంగా పనిచేద్దాం. గత ఎన్నికల్లో ప్రభాకర్‌ చౌదరి ఓడిపోయేందుకు కొన్ని కలుపు మొక్కలే కారణం. అలాంటి కలుపు మొక్కలను నిర్దాక్షిణ్యంగా పక్కనపెడితేనే పార్టీ బాగుపడుతుంది. మన ఆలోచన, మన బుద్ధి మంచిగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి.

- భవానీ రవికుమార్‌, జనసేన కార్యక్రమాల నిర్వహణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

అప్రమత్తంగా ఉండాలి..

టీడీపీ, జనసేన నాయకులు సమన్వయం చేసుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలి. రెండు పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ కుట్రలు చేస్తోంది. వాటిని కలిసికట్టుగా తిప్పికొట్టాలి. బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంతోపాటు ఓటరు వెరిఫికేషనపై ప్రత్యేక దృష్టి సారించాలి. టీడీపీ, జనసేన సానుభూతిపరుల ఓట్లను తొలగించకుండా చూసుకోవాలి. దొంగ ఓట్లను ఎక్కించకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి. టీడీపీ, జనసేన కూటమితో వైసీపీ పతనం తప్పదు.

- గాజుల ఆదెన్న, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి

తరలివచ్చిన నాయకులు

సమావేశానికి టీడీపీ నాయకులు తలారి ఆదినారాయణ, శివబాల, దేవళ్ల మురళి, డిష్‌ నాగరాజు, మారుతీకుమార్‌ గౌడ్‌, సాలార్‌ బాషా, గోపాల్‌ గౌడ్‌, నారాయణస్వామి యాదవ్‌, బంగి నాగ, ముక్తియార్‌, సుఽధాకర్‌ యాదవ్‌, నటేష్‌ చౌదరి, రాజారావు, గుర్రం నాగభూషణం, వన్నూరు, మార్కెట్‌ మహేష్‌, సుబాష్‌ చంద్రబోస్‌, వంకదారు వెంకటకృష్ణ, కురబ నారాయణస్వామి, బాలప్ప, కడియాల కొండన్న, మనోహర్‌, చెరుకుతోట పవనకుమార్‌, తెలుగు మహిళలు స్వప్న, సంగా తేజస్విని, విజయశ్రీరెడ్డి, సరళ, జనసేన నాయకులు పొదిలి బాబురావు, పెండ్యాల శ్రీలత, జయరామిరెడ్డి, మురళి, అంకె ఈశ్వరయ్య, రొళ్ల భాస్కర్‌, నాగేంద్ర, సంజీవరాయుడు, రాపా ధనుంజయ తదితరులు హాజరయ్యారు.

Updated Date - 2023-11-15T00:19:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising