శాస్త్రోక్తంగా అనంత పద్మనాభస్వామి వ్రతం

ABN , First Publish Date - 2023-09-28T23:11:20+05:30 IST

హెచ్చెల్సీ కాలనీలోని వలీ స్వామి ఆశ్రమంలో అక్కల్‌కోట మహరాజ్‌ సేవాసమితి ఆధ్వర్యంలో గురువారం అనంత పద్మనాభస్వామి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.

శాస్త్రోక్తంగా అనంత పద్మనాభస్వామి వ్రతం
అనంత పద్మనాభస్వామి వ్రతం నిర్వహిస్తున్న దృశ్యం

అనంతపురం కల్చరల్‌, సెప్టెంబరు 28: హెచ్చెల్సీ కాలనీలోని వలీ స్వామి ఆశ్రమంలో అక్కల్‌కోట మహరాజ్‌ సేవాసమితి ఆధ్వర్యంలో గురువారం అనంత పద్మనాభస్వామి వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంత పద్మనాభ స్వామితో పాటు పరివార దేవతామూర్తులకు అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు చేశారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ అనంత పద్మనాభస్వామి, పాండురంగస్వామి వ్రతాలను నిర్వహించారు. అదేవిధంగా కొల్హాపూర్‌ మహాలక్ష్మికి గాజుల అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సమితి సభ్యులు నాగేశ్వరరావు, విజయ్‌కుమార్‌, శ్రీధర్‌బాబు, కొండారెడ్డి, జయచంద్ర, మణూరు నాగరాజరావు, ఉమారాణి, శివమ్మ, వాణి, సీతాలక్ష్మి, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-28T23:11:20+05:30 IST