గుడివాడలోని 12వ వార్డులో విషాదం
ABN, First Publish Date - 2023-01-25T19:30:38+05:30
జిల్లాలోని గుడివాడలోని 12వ వార్డులో విషాదం చోటుచేసుకుంది. వైసీపీ నేతకు చెందిన ట్రాక్టర్ ఢీకొని మూడేళ్ల బాలుడు మృతి చెందాడు.
కృష్ణా: జిల్లాలోని గుడివాడలోని 12వ వార్డులో విషాదం చోటుచేసుకుంది. వైసీపీ నేతకు చెందిన ట్రాక్టర్ ఢీకొని మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ను పురపాలక సంఘం పేరుతో వైసీపీ నేత తిప్పుతున్నారు. ట్రాక్టర్ అతివేగంతో తిరుగుతోందని పలుమార్లు స్థానికుల ఫిర్యాదు కూడా చేశారు. బాలుడు కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
Updated Date - 2023-01-25T19:32:18+05:30 IST