ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Avinash Reddy: రేపు హైకోర్టులో అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ

ABN, First Publish Date - 2023-05-24T18:32:56+05:30

ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy) ముందోస్తు బెయిల్ పిటిషన్‌పై రేపు తెలంగాణా హైకోర్టు (Telangana Highcourt)లో విచారణ జరగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: మాజీ ఎంపీ వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి (Avinash Reddy) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై రేపు (గురువారం) తెలంగాణా హైకోర్టు (Telangana Highcourt)లో విచారణ జరగనుంది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు‌ వెకేషన్ బెంచ్‌ విచారణ జరిపేలా ఆదేశాలివ్వాలని అవినాష్ రెడ్డి ఇప్పటికే సుప్రీంకోర్టును కోరారు. విజ్ఞప్తిని పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపి తీర్పు వెల్లడించాలని హైకోర్టు‌కు జారీ చేసిన విషయం తెలిసిందే.

కాగా.. గురువారం అవినాష్ పిటిషన్‌పై విచారణ జరిపి న్యాయ స్థానం తీర్పు ఇవ్వనుంది. ఇదిలావుండగా... సీబీఐ (CBI) తనను అరెస్టు చేయకుండా చూడాలని అవినాష్ కోరగా సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. తన తల్లి ఆరోగ్యం కుదటపడే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అవినాష్ రెడ్డి కోరగా.. సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో ముందస్తు బెయిల్‌పై అవినాష్ ఆశలు పెట్టనున్నారు. అవినాష్ పిటిషన్‌లో సునీత ఇంప్లీడ్ అవ్వనుంది. అవినాష్‌కి ముందోస్తు బెయిల్ ఇస్తే, కేసులో జరిగే పరిణామాలపై కోర్టు దృష్టికి తీసుకెళ్తామని సీబీఐ, సునీత పేర్కొన్నారు. ముందోస్తు బెయిల్‌పై కోర్టు నిర్ణయం ఎలా ఉంటుందని అవినాష్‌లో టెన్షన్ ఏర్పడింది.

Updated Date - 2023-05-24T18:44:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising