Ram Mohan Naidu: ‘వారు హద్దు దాటి ప్రవర్తిస్తే.. ఊరుకునేది లేదు’
ABN, First Publish Date - 2023-06-20T21:35:45+05:30
బాలిగాంలో గౌతు శివాజీపై అక్రమ కేసులు దారుణమని ఎంపీ రామ్మోహన్నాయుడు (MP Ram Mohan Naidu) అన్నారు.
శ్రీకాకుళం: బాలిగాంలో గౌతు శివాజీపై అక్రమ కేసులు దారుణమని ఎంపీ రామ్మోహన్నాయుడు (MP Ram Mohan Naidu) అన్నారు. వైసీపీ (YCP) కోసం పనిచేస్తున్నారా?.. 3 రంగుల జెండా కోసం పని చేస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. పోలీసులు హద్దు దాటి ప్రవర్తిస్తే.. ఊరుకునేది లేదని హెచ్చరించారు. బాలుడు అమర్నాథ్ హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమన్నారు. మంత్రిగా పనిచేసిన సీనియర్ నేత గౌతు శివాజీపై టెక్కలి డీఎస్పీ ఇష్టానుసారంగా ప్రవర్తించారని మండిపడ్డారు. పలాస పోలీసులకు పౌరుషం ఉంటే భూకబ్జాలను అరికట్టాలన్నారు. అనకొండలా మంత్రి సీదిరి కొండలను మింగేస్తున్నారని విమర్శించారు.
Updated Date - 2023-06-20T21:38:23+05:30 IST