TDP: ‘ఆ కేసును అలిపిరి బాంబు బ్లాస్ట్‌తో ముడిపెట్టడం దృష్టిమరల్చే కుట్రే’
ABN , First Publish Date - 2023-04-15T21:43:30+05:30 IST
కోడికత్తి కేసును అలిపిరి బాంబు బ్లాస్ట్‌తో ముడిపెట్టడం దృష్టిమరల్చే కుట్రేనని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు (bonda uma) అన్నారు.
అమరావతి: కోడికత్తి కేసును అలిపిరి బాంబు బ్లాస్ట్‌తో ముడిపెట్టడం దృష్టిమరల్చే కుట్రేనని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు (bonda uma) అన్నారు. కోడికత్తి శ్రీనివాస్ (Srinivas) జగన్ రెడ్డి (Jagan Reddy) అభిమాని అని అతని లేఖతోనే తేలిందన్నారు. టీడీపీ (TDP)తో సంబంధం లేదని ఎన్ఐఏ కౌంటర్ పిటిషన్ పేరా నెం.6లో పేర్కొందన్నారు. వ్యవస్థల్ని మేనేజ్ చేయగల అధికారం, రూ.2 లక్షల కోట్ల అవినీతి డబ్బు జగన్ రెడ్డి దగ్గరే ఉందని చెప్పారు. నాలుగేళ్లుగా కోర్టు వాయిదాలకు వెళ్లకుండా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నదెవరు?, అవినాశ్ రెడ్డి, భాష్కర్ రెడ్డి అరెస్టు కాకుండా ఢిల్లీ వెళ్లి మేనేజ్ చేసిందెవరు?, జయలలిత, లాలూ ప్రసాద్ యాదవ్‌లకు లభించని మినహాయింపు జగన్ రెడ్డి ఎలా సాధ్యం? అని ఆయన ప్రశ్నించారు. అలిపిరి బాంబ్ బ్లాస్ట్ నేరస్తులకు జగన్ రెడ్డి అనుచరుడు ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి సెల్‌ఫోన్లు ఇచ్చాడని ఆరోపించారు. అలిపిరి బాంబ్ బ్లాస్ట్, పరిటాల రవి హంతకులతో జగన్ రెడ్డికి సంబంధాలున్నాయనే ఆరోపణలున్నాయన్నారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే గంగిరెడ్డికి బెయిల్ ఎలా వచ్చింది?, కొల్లం గంగిరెడ్డి కుటుంబం వైసీపీలో కొనసాగుతోందన్న విషయం వాస్తవం కాదా? అని బొండా ఉమా ప్రశ్నించారు. కోడికత్తి శ్రీను గానీ, అతని కుటుంబం గానీ టీడీపీలో లేదన్నారు. అలిపిరి బాంబు బ్లాస్ట్ కేసును కోడికత్తి కేసుతో ముడిపెట్టడం బోడిగుండుకు మోకాలికి ముడివేయడమేనన్నారు.