మంత్రి రోజా చెప్పులు మోసిన ఉద్యోగి

ABN , First Publish Date - 2023-02-10T04:30:12+05:30 IST

పర్యాటకశాఖ మంత్రి రోజా గురువారం బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరాన్ని సందర్శించారు. సరదాగా సముద్ర జలాల్లోకి దిగారు.

మంత్రి రోజా చెప్పులు మోసిన ఉద్యోగి

పర్యాటకశాఖ మంత్రి రోజా గురువారం బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరాన్ని సందర్శించారు. సరదాగా సముద్ర జలాల్లోకి దిగారు. అయితే ఆ సమయంలో తన చెప్పుల్ని బయట విడిచిపెట్టారు. పర్యాటకశాఖ హౌస్‌ కీపింగ్‌ ఉద్యోగి ఒకరు ఆ చెప్పులు తడిసిపోకుండా వాటిని చేతితో పట్టుకుని తిరిగారు. మంత్రి ఒడ్డుకు వచ్చిన తర్వాత వాటిని ఆమె కాళ్ల దగ్గర పెట్టారు. అయితే ఉద్యోగి ఇలా చెప్పులు మోయడం, మంత్రి వారించకపోవడం విమర్శలకు దారితీసింది. - బాపట్ల

Updated Date - 2023-02-10T04:30:14+05:30 IST