ఆ అజ్ఞాత వ్యక్తి జగనే.. అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయం : బీజేపీ జాతీయ కార్యదర్శి

ABN , First Publish Date - 2023-05-24T11:08:14+05:30 IST

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టును అడ్డుకునే అజ్ఞాత వ్యక్తి ఏపీ ముఖ్యమంత్రి జగన్ అని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయమన్నారు. అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఆలస్యం అవడం కూడా సీబీఐ వ్యూహాత్మక వ్యవహారమేనన్నారు.

ఆ అజ్ఞాత వ్యక్తి జగనే.. అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయం : బీజేపీ జాతీయ కార్యదర్శి

తిరుపతి : వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టును అడ్డుకునే అజ్ఞాత వ్యక్తి ఏపీ ముఖ్యమంత్రి జగన్ అని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయమన్నారు. అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఆలస్యం అవడం కూడా సీబీఐ వ్యూహాత్మక వ్యవహారమేనన్నారు. గొడ్డలి పోటును గుండె పోటు చేసిన వారిని అరెస్ట్ కాకుండా ఆపడం ఎవరి వల్లా సాధ్యం కాదని సత్యకుమార్ పేర్కొన్నారు. బీజేపీ కాపాడుతుందనేది అబద్ధమన్నారు.

ఇంకా సత్యకుమార్ మాట్లాడుతూ.. ‘‘మైనారిటీల ఓట్లు కాంగ్రెస్‌కు పడటం వల్ల కర్ణాటకలో గెలుపు సాధ్యమైంది. పొత్తు అనగానే బీజేపీ కేంద్రంగానే చర్చ జరుగుతోంది. పొత్తు అనేది ఎన్నికలకు ఒకటి రెండు నెలల ముందు నిర్ణయం అవుతుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు స్పీడ్ ఎక్కువ. పొత్తుల విషయంలో కేంద్ర పార్టీ దే తుది నిర్ణయం. రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేస్తాం. పవన్ చెప్పిన ఈ మాటకు మేము కట్టుబడి ఉన్నాము. ప్రజల కోసం రాజీ పడాల్సి వస్తే పార్టీ రాజీ పడుతుంది. నేల మాళిగల్లో దాగిన 2000 నోట్లను బయటకు తీయటానికే నోట్ల రద్దు. ఏపీలో మేము చేస్తున్న అభివృద్ధిని మీడియా చూపక పోవటమే ఏపీలో బీజేపీ వెనుకబడి పోవటానికి కారణం’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2023-05-24T11:08:14+05:30 IST