ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bonda Uma: పోలీస్ సంఘానికి వైసీపీ నేతల ధూషణలు కనిపించవా

ABN, First Publish Date - 2023-08-11T14:32:14+05:30

పోలీస్ అధికారుల సంఘాని(Police Union)కి వైసీపీ నేతల(YCP Leaders) ధూషణలు కనిపించవా అని తెలుగుదేశం పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswara Rao)ప్రశ్నించారు.

అమరావతి: పోలీస్ అధికారుల సంఘాని(Police Union)కి వైసీపీ నేతల(YCP Leaders) ధూషణలు కనిపించవా అని తెలుగుదేశం పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswara Rao)ప్రశ్నించారు.శుక్రవారం నాడు ఆయన మీడయాతో మాట్లాడుతూ... పోలీసులపై దాడిచేస్తున్న అధికారపార్టీ నేతలను చట్టప్రకారం శిక్షించే దమ్ము, ధైర్యం డీజీపికి ఉన్నాయా? అని నిలదీశారు. అంగళ్లు, పుంగనూరు ఘటనల్లో చంద్రబాబు, టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసులు పెట్టించినంత తేలిగ్గా...వైసీపీవాళ్లపై డీజీపీ చర్యలు తీసుకోగలరా? అని ప్రశ్నించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అతని తమ్ముడు ద్వారకానాథ్‌రెడ్డి అండతో బాధితులపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని మండిపడ్డారు. అనంతపురంలో ఎక్సైజ్ పోలీసులపై వైసీపీనేతల దాడిని ఎలా సమర్థించుకుంటారు? అని ప్రశ్నించారు. మంత్రి అప్పలరాజు పోలీసులపై చేసిన ధూషణలు పోలీస్ అధికారుల సంఘానికి కనిపించలేదా? మాజీ మంత్రి పేర్నినాని మీడియా సాక్షిగా తోటి సిబ్బందిని అవమానిస్తే పోలీస్ అధికారులు ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు. తన దుర్మార్గాల్లో పోలీసులను భాగస్వాములను చేస్తూ, వాళ్లకే అలవెన్సులు నిలిపేస్తే, పోలీస్ సంక్షేమ విభాగం జగన్‌రెడ్డిని ఎందుకు నిలదీయడం లేదన్నారు.పోలీస్ అధికారులు పద్ధతి, ప్రవర్తన మార్చుకొని చట్టప్రకారం పనిచేస్తే వారికే మంచిదన్నారు. భీమవరంలో అర్చకుడిపై వైసీపీ నేత దాడి... హిందూ ధర్మానికే అవమానకరమని చెప్పారు.యజ్ఞోపవీతాన్ని తెంపేసిన దురహంకారి తీరుపై జగన్‌రెడ్డిని సమర్థించే స్వామీజీలు ఎందుకు స్పందించడం లేదు అని బొండా ఉమామహేశ్వరరావు నిలదీశారు.

Updated Date - 2023-08-11T14:32:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising