Bonda Uma: హిందూ ధర్మం అంటే జగన్‌కు గౌరవం లేదు
ABN, First Publish Date - 2023-08-10T18:25:38+05:30
జగన్ పాలన(Jagan govt)లో హిందూ ధర్మానికి విగాతం కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి.. హిందూ ధర్మం(Hindu Dharmam) అంటే జగన్‌కు గౌరవం లేదని తెలుగుదేశం సీనియర్ నేత బోండా ఉమా(Bonda Uma) అన్నారు.
అమరావతి: జగన్ పాలన(Jagan govt)లో హిందూ ధర్మానికి విగాతం కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి.. హిందూ ధర్మం(Hindu Dharmam) అంటే జగన్‌కు గౌరవం లేదని తెలుగుదేశం సీనియర్ నేత బోండా ఉమా(Bonda Uma) అన్నారు. గురువారం నాడు బోండా ఉమా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘విజయనగరంలో ప్రసిద్ది చెందిన ఆలయంలో శ్రీరాముని తల తీసేస్తే ఎటువంటి చర్యలు లేవు.రాష్ట్రంలో 150 ఆలయాలను ధ్వంసం చేశారు.అంతర్వేదిలో రధాన్ని దగ్ధం చేసిన వారిని ఇప్పటివరకూ నిందితులను అరెస్ట్ చేయలేదు.తిరుమల దేవస్థానాన్ని సైతం కమర్షియల్‌గా మార్చేశారు. మంచినీళ్ల బాటిల్ కొనాలంటే 40 రూపాయలు , ప్రసాదాలను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నారు.భీమవరం సోమేశ్వరస్వామి దేవస్థానంలో అర్చకుడి పై దాడులు చేసి యజ్ఞోపవేదాన్ని వైసీపీ నేతలు తెంచేశారు.పౌరహిత్యం చేసే వారి పై దాడులు చేస్తే వారు ఎక్కడికి వెళ్లాలి’’ అని తీవ్ర స్థాయిలో బోండా ఉమా వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
Updated Date - 2023-08-10T18:25:38+05:30 IST