Kodali Nani: చంద్రబాబు, లోకేష్‌కు దమ్ముంటే అక్కడ పోటీ చేయాలి

ABN , First Publish Date - 2023-05-28T13:32:26+05:30 IST

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu), టీడీపీ (TDP) నేతలపై గుడివాడ వైసీపీ (YCP) ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) విమర్శలు గుప్పించారు.

Kodali Nani: చంద్రబాబు, లోకేష్‌కు దమ్ముంటే అక్కడ పోటీ చేయాలి

గుడివాడ, కృష్ణాజిల్లా: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu), టీడీపీ (TDP) నేతలపై గుడివాడ వైసీపీ (YCP) ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) విమర్శలు గుప్పించారు. స్క్రాప్ బ్యాచ్ అంతా రాజమండ్రిలో మహానాడు సభ పెట్టుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌కు (Nara Lokesh) దమ్ముంటే గుడివాడ, గన్నవరంలో పోటీ చేయాలని కొడాలి నాని సవాల్ చేశారు. ఎన్టీఆర్ పేరుతో, ప్రజలకు వెన్నుపోటు పొడిచేందుకు చంద్రబాబు సిద్ధమయ్యాడని, ఎన్టీఆర్ ఉంటే పార్టీ, రాష్ట్రం నాశనం అవుతుందన్న చంద్రబాబు, గతిలేక, రాజకీయంగా బతకడానికి తిరిగి ఎన్టీఆర్ పేరు వాడుకుంటున్నాడని నాని వ్యాఖ్యానించారు.

రాజకీయాలంటే బట్టల వ్యాపారమా, ఆకర్షణీయమైన మేనిఫెస్టో పెట్టడానికి అని మండిపడ్డారు. చంద్రబాబుకు 2024 ఎన్నికల్లో ఎదురు దెబ్బ తప్పదని, చంద్రబాబు ఆకర్షణీయమైన అబద్ధాలు, వెన్నుపోట్లు ప్రజలందరికీ తెలుసన్నారు. చంద్రబాబు, లోకేష్‌ను తరిమికొట్టి, ఎన్టీఆర్ వారసులు టీడీపీని స్వాధీనం చేసుకుంటారని కొడాని నాని జోస్యం చెప్పారు. దేశమంతా తిరిగినా చంద్రబాబు లాంటి నీచ రాజకీయ నాయకుడు మరొకరు ఉండరన్నారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి కొడాలి నాని నివాళులర్పించారు.

Updated Date - 2023-05-28T13:42:17+05:30 IST