Share News

గదిలోకి ఉడుము పరుగులు తీసిన భక్తులు

ABN , First Publish Date - 2023-10-23T01:55:56+05:30 IST

తిరుమలలో భక్తులు బసచేసే ఓ గదిలోకి ఆదివారం ఉడుము ప్రవేశించింది.దాన్ని చూసిన వారు భయం తో పరుగులు తీశారు.

గదిలోకి ఉడుము  పరుగులు తీసిన భక్తులు
పట్టుబడిన ఉడుమ

తిరుమల, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో భక్తులు బసచేసే ఓ గదిలోకి ఆదివారం ఉడుము ప్రవేశించింది.దాన్ని చూసిన వారు భయం తో పరుగులు తీశారు. నారాయణగిరి-3 కాటేజీ వెనుక భాగంలోని అడవి నుంచి ఓ ఉడుము 17వ నెంబరు గదిలోకి ప్రవేశించింది. దాన్ని చూసిన భక్తులు భయంతో పరుగున బయటికి వచ్చేశారు. పాములు పట్టే టీటీడీ కాంట్రాక్ట్‌ ఉద్యోగి భాస్కర్‌నాయుడికి సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి ఉడుమును పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు.

Updated Date - 2023-10-23T01:55:56+05:30 IST