ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rammohan Naidu: రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో సీఎం విఫలం: రామ్మోహన్‌నాయుడు

ABN, First Publish Date - 2023-04-20T18:55:24+05:30

రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో సీఎం జగన్‌ (CM Jagan) విఫలమయ్యారని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు (Rammohan Naidu) దుయ్యబట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో సీఎం జగన్‌ (CM Jagan) విఫలమయ్యారని శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు (Rammohan Naidu) దుయ్యబట్టారు. శ్రీకాకుళంలో చంద్రబాబు జన్మదిన వేడుకల్లో ఎంపీ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశంలోనే జగన్‌ ధనిక సీఎం అని చెప్పారు. తల్లిని, చెల్లిని వదిలేశారని.. బాబాయ్‌ను హత్యచేయించారని...అటువంటప్పుడు ఒంటరినని చెప్పుకోవడం ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అని ఉన్నతాధికారి ప్రకటించుకోవడం సిగ్గుచేటన్నారు. రైల్వే జోన్‌ కోసం అడగరని, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ (Visakha Steel Plant) ప్రైవేటీకరణను అడ్డుకోలేరని ఎద్దేవా చేశారు.

నెలలో మూడు సార్లు ఢిల్లీకి ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు. బాబాయి హత్యకేసులో నిందితులను కాపాడేందుకేనని విమర్శించారు. ఎటువంటి అభివృద్ధి చేయలేక సిగ్గుతో ఇంటింటికీ వెళ్లి స్టికర్లు అతికించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. సోషల్‌ మీడియాలో కట్టుకథలు రాసే ఒక టీం ఉందని.. వారు రాసే కథలు సినిమాలుగా తీస్తే దేశవ్యాప్తంగా ఘనవిజయం సాధించడం ఖాయమన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు (Chandrababu) నాయకత్వం అవసరమన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ (TDP) గెలుపు తథ్యమని రామ్మోహన్‌నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-04-20T18:55:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising