ఆర్టీసీ నవీనీకరణకు చర్యలు
ABN , First Publish Date - 2023-02-25T00:56:38+05:30 IST
ఆర్టీసీలో ప్రయాణికుల సౌక ర్యాల కల్పనకు..సిబ్బంది సమ స్యల పరిష్కారానికి చర్యలు చేపడుతు న్నామని ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమల రావు అన్నారు.
నిడదవోలు, ఫిబ్రవరి 24 : ఆర్టీసీలో ప్రయాణికుల సౌక ర్యాల కల్పనకు..సిబ్బంది సమ స్యల పరిష్కారానికి చర్యలు చేపడుతు న్నామని ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమల రావు అన్నారు.నిడదవోలు ఆర్టీసీ డిపో ను శుక్రవారం సందర్శించి మాట్లాడారు. ఆర్టీసీలో నవీనీకరణ పేరుతో పల్లె వెలుగు, సిటీ బస్సులను ఆధు నీకరించామన్నారు.ఈ ఏడాది ఎక్స్‌ప్రెస్, లగ్జరీ, అల్ర్టా డీలక్స్ బస్సులను నవీనీకరిస్తామన్నారు. ఆర్టీసీలో 50 వేల మంది ఉద్యోగులు ఉండగా వీరిలో 2096 మందికి పీఆర్సీ అమలులో సాంకేతిక సమస్యలు తలెత్తాయన్నారు. దీన్ని కూడా పరిష్కరించే దిశగా చర్యలు చేప ట్టామన్నారు. ఆర్టీసీ డిపో ఆవరణలో మొక్కలు నాటి కార్మికు లతో కొద్దిసేపు సమావేశ మయ్యారు.సీపీఎం నాయకుడు జువ్వల రాంబాబు డిపో సమస్యలపై ఎండీకి వినతిపత్రం అందజేశారు.
=============================