ఎర్ర గంగిరెడ్డి బెయిల్ క్యాన్సలేషన్ పిటిషన్‌లో ఇంప్లిడ్ అయిన సునీత
ABN , First Publish Date - 2023-04-26T13:00:37+05:30 IST
ఎర్ర గంగిరెడ్డి బెయిల్ క్యాన్సలేషన్ పిటిషన్‌లో వైఎస్ వివేకా కూతురు సునీత ఇంప్లిడ్ అయ్యారు. ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు.. సునీత తరపు వాదనలు వినిపించారు.
హైదరాబాద్ : ఎర్ర గంగిరెడ్డి బెయిల్ క్యాన్సలేషన్ పిటిషన్‌లో వైఎస్ వివేకా కూతురు సునీత ఇంప్లిడ్ అయ్యారు. ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు.. సునీత తరపు వాదనలు వినిపించారు. గంగి రెడ్డి లాంటి నిందితుడు బయట ఉంటే సమాజానికి తప్పుడు సంకేతం వెళ్తుందని ధర్మాసనానికి తెలిపారు. అత్యంత ప్రభావితం చేసే వ్యక్తి గంగిరెడ్డి అని పేర్కొన్నారు. హత్య చేసిన వ్యక్తి బయట తిరుగుతుంటే బాధితులకు న్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు.
గంగిరెడ్డి తరపు న్యాయవాది వాదనలు...
అన్ని ఆరోపణలు పరిశీలించాకే ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని గంగిరెడ్డి తరపు న్యాయవాది పేర్కొన్నారు. గతంలో సిట్ గంగి రెడ్డిని నార్కో అనాలసిస్ చేసింది కానీ వివరాలు ఇవ్వలేదన్నారు. ఇప్పటి వరకూ దర్యాప్తు సంస్థల ముందు గంగి రెడ్డి 72 సార్లు విచారణకు హాజరయ్యారు. కొత్తగా గంగిరెడ్డిని విచారించాల్సింది ఏమి లేదని తెలిపారు.
సీబీఐ వాదనలు...
వివేక హత్యలో ప్రధాన పాత్ర పోషించింది గంగి రెడ్డేనని సీబీఐ తెలిపింది. ప్రధాన నిందితుడిగా ఉండి ఇతను బయట ఉండటంతో సాక్షులు ముందుకు వచ్చేందుకు భయపడుతున్నారన్నారని తెలిపింది. ఏపీ హై కోర్ట్ ఇచ్చిన డీఫాల్ట్ బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నామని పేర్కొంది. గంగి రెడ్డి బయట ఉండటం అంత మంచిది కాదని సీబీఐ తెలిపింది. హత్య చేయడమే కాదు, నేరం కప్పిపుచ్చేందుకు ఆధారాలు కూడా చేరిపేశారని తెలిపింది. వెంటనే గంగి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరింది.