ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gudivada Farmers: సహాయం చేయకున్నా పర్వాలేదు.. అవమానం వద్దు.. కొడాలిపై అన్నదాతల ఫైర్

ABN, First Publish Date - 2023-08-16T13:12:47+05:30

ఎమ్మెల్యే కొడాలి నానిపై గుడివాడ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కృష్ణా జిల్లా: ఎమ్మెల్యే కొడాలి నానిపై (MLA Kodali Nani) గుడివాడ రైతులు (Gudivada Farmers) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాల కారణంగా నియోజకవర్గంలో నాట్లు మునగలేదని... రైతు నష్టపోలేదని కొడాలి నాని వ్యాఖ్యలపై అన్నదాతలు ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో నాట్లు మునిగాయని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సహాయం చేయకున్నా పర్వాలేదు కానీ అవమానపరిచే వ్యాఖ్యలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. 70 ఏళ్లలో ఇంత చిన్న పాటి వర్షానికి తాము ఎప్పుడూ, ఇంతలా నష్టపోలేదని గుడివాడ రైతులు వాపోయారు.


రైతులకు టీడీపీ నేత వెనిగాండ్ల రాము సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ... చెరువులను తలపించేలా పొలాలు మునిగి.. రైతులకు పెను నష్టం జరిగిందన్నారు. గుడివాడలో నాట్లు మునగలేదని.. రైతులు నష్టం జరగలేదని ఎమ్మెల్యే నాని అనడం బాధ్యతారహిత్యమన్నారు. రైతులంటే ఇంత చులకనా అంటూ మండిపడ్డారు. చేతకాక పోతే కూర్చోండి.. హేళనగా మాట్లాడితే సహించేది లేదని అన్నారు. పకోడీ పురాణం తప్ప, ప్రజల సమస్యలు ఎమ్మెల్యేకు పట్టవని వ్యాఖ్యలు చేశారు. నష్టపోయిన రైతులు వారి కష్టాలు వారు పడుతుంటే... ఎమ్మెల్యే నాని సిగ్గులేని వ్యాఖ్యలు దుర్మార్గమన్నారు. గ్రామాల్లో రైతుల కన్నీరు చూసి గుండె తరుక్కుపోయిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న తాము ఎక్కడికక్కడ రైతుకు అండగా నిలిచామని తెలిపారు. అధికారంలో ఉన్నా కొడాలి నాని ఏం చేశారని ప్రశ్నించారు. ఇప్పటి వరకు రైతును పరామర్శించలేని ఇలాంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉండడం దౌర్భాగ్యమని వెనిగాండ్ల రాము విరుచుకుపడ్డారు.

Updated Date - 2023-08-16T13:12:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising