Chintamohan: చంద్రబాబు అరెస్టు వెనక బీజేపీ కుట్ర
ABN, First Publish Date - 2023-09-30T15:42:36+05:30
కాంగ్రెస్ - తెలుగుదేశం(Congress - Telugu Desam) పొత్తుకు సంబంధించి మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ (Chintamohan) సంచలన ప్రతిపాదన తీసుకొచ్చారు.
అమరాపతి: కాంగ్రెస్ - తెలుగుదేశం(Congress - Telugu Desam) పొత్తుకు సంబంధించి మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ (Chintamohan) సంచలన ప్రతిపాదన తీసుకొచ్చారు. శనివారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్- తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని ఆ దిశగా రెండు పార్టీలు నిర్ణయం తీసుకోవాలి అని తన అభిప్రాయం తెలిపారు. తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలి. ఈ పార్టీలన్నీ కలిసి 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు సీట్లను కైవసం చేసుకోగలదు. చంద్రబాబు అరెస్టు వెనక బీజేపీ కుట్ర ఉంది. బీజేపీ ధరలు పెంచి ప్రజలను ఇబ్బంది పెడుతోంది. జగన్ పాలనలో అడుగడుగునా అవినీతి దోపిడి జరుగుతోంది. పొత్తుపై కాంగ్రెస్ పార్టీలో నేనింకా చర్చించలేదు. ప్రజలు కూడా ఈ దిశగా ఆలోచన చేయాలని వ్యక్తిగతంగా కోరుతున్నాను’’ అని చింతామోహన్ పేర్కొన్నారు.
Updated Date - 2023-09-30T16:26:52+05:30 IST