.ఏఎన్‌యూలో జర్నలిజం డిప్లొమా కోర్సు
ABN , First Publish Date - 2023-03-28T00:29:33+05:30 IST
గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల వృత్తి నైపుణ్యం పెంచ డమే లక్ష్యంగా సీ.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి ఈ ఏడాది నుంచి జర్నలిజంలో డిప్లొమా కోర్సును ప్రారంభిస్తుందని ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు.
ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహణ
ఒప్పంద పత్రాలను మార్చుకున్న అధికారులు
పెదకాకాని, మార్చి27: గ్రామీణ ప్రాంత జర్నలిస్టుల వృత్తి నైపుణ్యం పెంచ డమే లక్ష్యంగా సీ.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి ఈ ఏడాది నుంచి జర్నలిజంలో డిప్లొమా కోర్సును ప్రారంభిస్తుందని ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు. ఈక్రమంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యా లయం జర్నలిజం విభాగంతో పరస్పర ఒప్పందం కుదిరినట్లు పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య. పీ.రాజశేఖర్ సమక్షంలో ప్రెస్ అకాడమి చైర్మన్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పీ.రాజకుమార్‌లు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. అనంతరం కొమ్మినేని మాట్లాడుతూ 6 నెలల వ్యవధితో కూడిన ఈ డిప్లమో కోర్సు సిలబస్‌ను ఇప్పటికే రూపొందిం చామన్నారు. మూడేళ్ల అనుభవం, ఇంటర్ విద్యార్హత కలిగిన జర్నలిస్టులు ఈ డిప్లొమా కోర్సుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. డిగ్రీ విద్యార్హత కలిగిన ఇతరులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కోర్సు ఆన్‌లైన్ విధా నంలో ఉంటుందని, పరీక్షల నిర్వహణ, ధ్రువపత్రాల ప్రదానం వంటి అకడ మిక్ అంశాలను నాగార్జున యూనివర్సిటీ జర్నలిజం విభాగం నిర్వహిస్తుం దన్నారు. వీసీ ఆచార్య. పీ.రాజశేఖర్ మాట్లాడుతూ అకడమిక్ అంశాల్లో తమ యూనివర్సిటీ జర్నలిజం విభాగం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని ఆయన హామీనిచ్చారు. కోర్సు ఏర్పాటుకు సంబంధిచిన మెమోరాండం ఆఫ్ అండర్ ష్టాండింగ్ (ఎంవోయూ)పై ప్రెస్ అకాడమీ సెక్రెటరీ ఎం.బాలగంగాధర్ తిలక్, నాగార్జున యూనివర్సిటీ రిజిస్ర్టార్ బీ.కరుణ సంతకాలు చేశారు. కార్యక్రమం లో ఏఎన్‌యూ జర్నలిజం విభాగాధిపతి డాక్టర్ జి.అనిత, అధ్యాపకులు డాక్టర్ మధు బాబు, డాక్టర్ మాణిక్యరావు, ఆచార్య. శ్రీనివాస రెడ్డి, ఆచార్య. నాగరాజు, ప్రెస్ అకాడమీ కంటెంట్ ఎడిటర్ కలమండ శరత్‌బాబు పాల్గొన్నారు.
ఏఎన్‌యూలో జర్నలిజం డిప్లొమా కోర్సు