Nakka Anandbabu: ఎంపీ తల్లికి కర్నూలు ఆస్పత్రిలో వైద్యం విడ్డూరం
ABN , First Publish Date - 2023-05-22T11:41:28+05:30 IST
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ సందర్భంగా జరుగుతున్న పరిణామాలపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
గుంటూరు: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (Former Minister YS Viveka Case) ఎంపీ అవినాశ్ రెడ్డి(MP Avinash Reddy) సీబీఐ విచారణ సందర్భంగా జరుగుతున్న పరిణామాలపై టీడీపీ నేతలు (TDP Leaders) తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు (Former Minister Nakka Anandbabu) మాట్లాడుతూ... ఏపీలో అసలు పోలీసు వ్యవస్థ ఉందా అని ప్రశ్నించారు. మీడియాపై అవినాష్ గూండాలు నిత్యం దాడులు చేస్తుంటు పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ అధికారులు కూడా భయపడే పరిస్థితి ఎందుకని అడిగారు. కర్నూలు ఆసుపత్రిలో ఇతర రోగులు పరిస్థితి ఏంటని నిలదీశారు. చిన్న చిన్న రోగాలకే వైసీపీ నేతలు హైదరాబాద్ వెళ్లిన పరిస్థితి.. అలాంటిది ఎంపీ తల్లికి గుండె పోటు వస్తే కర్నూలు ఆసుపత్రిలో వైద్యం చేయించడం విడ్డూరమన్నారు. ఏపీలో రాజ్యాంగం అమలు కావడం లేదని గతంలో ఓ హైకోర్టు జడ్జి వ్యాఖ్యానించారని... ఇప్పుడు కర్నూలులో పరిస్థితి చూస్తే వాస్తవం అనిపిస్తుందని నక్కా ఆనంద బాబు వ్యాఖ్యలు చేశారు.