ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Prathipati pullarao: కేసులు పెట్టేది, పెట్టించేది పోలీసులే...

ABN, First Publish Date - 2023-10-04T13:15:25+05:30

అంగళ్లు ఘటనతో పోలీసుల ఉద్దేశాలు దేశానికి తెలిశాయని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

పల్నాడు: అంగళ్లు ఘటనతో పోలీసుల ఉద్దేశాలు దేశానికి తెలిశాయని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (Former Minister Prathipati Pulla Rao) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసులు పెట్టేది, పెట్టించేది కూడా పోలీసులే అని వ్యాఖ్యలు చేశారు. చివరకు సాక్షులుగా కూడా పోలీసులనే పెడుతున్నారని మండిపడ్డారు. జూలకంటి బ్రహ్మారెడ్డిని తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. ఆగస్టు 30న గొడవలు జరిగితే ఇప్పుడు బ్రహ్మారెడ్డిపై కేసు పెట్టడమేంటి అని ప్రశ్నించారు. ఇప్పుడు బ్రహ్మారెడ్డిపై కేసు పెట్టడమే పోలీసుల ఉద్దేశాన్ని తెలియజేస్తోందన్నారు. అంగళ్లు ఘటనలో కూడా నాలుగు రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారన్నారు. బండారు అరెస్టు విషయంలో కూడా ఇదే అత్యుత్సాహం ప్రదర్శించారని విమర్శించారు. టీడీపీ వారిపై వీలైనన్ని కేసులు పెట్టి తిరగకుండా చేయాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర హైకోర్టులో పోలీసులకు తలబొప్పి కట్టడం ఖాయమన్నారు. భవిష్యత్తులో జగన్ రెడ్డి వల్ల ఏపీ పోలీసులు జైళ్ళకు వెళ్లడం ఖాయమని ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు.

Updated Date - 2023-10-04T13:15:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising