AP High Court: ఆ కుటుంబాలను వెంటనే గ్రామంలోకి అనుమతించాలని హైకోర్టు ఆదేశం

ABN , First Publish Date - 2023-09-20T16:27:23+05:30 IST

మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)కి చెందిన 64 మంది సానుభూతిపర కుటుంబాలపై వైసీపీ నేతలు వేధింపులకు గురి చేసి 2019లో గ్రామ బహిష్కరణ వేటు వేశారు.

AP High Court: ఆ కుటుంబాలను వెంటనే గ్రామంలోకి అనుమతించాలని హైకోర్టు ఆదేశం

పల్నాడు: మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో ఉన్న తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)కి చెందిన 64 మంది సానుభూతిపర కుటుంబాలపై వైసీపీ నేతలు వేధింపులకు గురి చేసి 2019లో గ్రామ బహిష్కరణ వేటు వేశారు. కాగా ఈ విషయంపై టీడీపీ సానుభూతిపర కుటుంబాలు హైకోర్టు(High Court)లో రిట్‌ పిటిషన్‌ వేశారు. 64 ఆ కుటుంబాలను ఎందుకు గ్రామ బహిష్కరణ చేశారనే విషయంపై హైకోర్టు విచారణ చేపట్టింది. బాధిత కుటుంబాలకు రక్షణ కల్పించాలని న్యాయవాదులు హైకోర్టును కోరారు. తెలుగుదేశం పార్టీపై ఉన్న అక్కసుతోనే తీవ్ర మానసిక వేదనకు గురిచేసి గ్రామం నుంచి బహిష్కరించి వేశారని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోకి వస్తే చంపేస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని.. బాధిత కుటుంబాల తరుపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరుపు వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది.64 కుటుంబాలను వెంటనే గ్రామంలోకి అనుమతించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. పిటిషనర్ల తరుపున నర్రా శ్రీనివాస్, ముప్పాల బాలకృష్ణ వాదనలు వినిపించారు.

Updated Date - 2023-09-20T16:27:23+05:30 IST