AP News: గొట్టిపాళ్ల టీడీపీ బాధితులకు ఆశ్రయం కల్పించారంటూ పోలీసుల వేధింపులు
ABN , First Publish Date - 2023-09-01T10:51:15+05:30 IST
జిల్లాలోని వెల్దుర్తి మండలం గంగలకుంటలో టీడీపీ వర్గీయులపై పోలీసుల వేధింపులు కొనసాగుతున్నాయి.
పల్నాడు: జిల్లాలోని వెల్దుర్తి మండలం గంగలకుంటలో టీడీపీ వర్గీయులపై పోలీసుల వేధింపులు కొనసాగుతున్నాయి. గ్రామానికి చెందిన ఐదుగురుని ఈరోజు(శుక్రవారం)వేకువజామున పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారు. ఇటీవల గొట్టిపాళ్ళలో వైసీపీ వర్గీయుల దాడిలో పలువురు టీడీపీ వర్గీయులు గాయపడిన విషయం తెలిసిందే. దీంతో టీడీపీ వర్గీయులకు గంగలకుంట గ్రామస్తులు ఆశ్రయం కల్పించారు. టీడీపీ వర్గీయులకు ఆశ్రయం కల్పించడంతో గంగలకుంట గ్రామస్తులపై పోలీసులు వేధింపులు షురూ చేశారు. గొట్టిపాళ్ళ ఘర్షణలో టీడీపీ వర్గియులపై 307 కేసులు నమోదు చేయగా.. వైసీపీ వర్గీయులపై సాధారణ కేసులు నమోదు అయ్యాయి. దీంతో పోలీసుల తీరుపై తెలుగుదేశం నేతలు తీవ్రస్థఆయిలో మండిపడుతున్నారు.