Prattipati Pullarao: మంత్రి రజిని అవినీతి చిట్టాకు లెక్కే లేదు
ABN, First Publish Date - 2023-08-17T15:42:25+05:30
పల్నాడు జిల్లా: తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజినిపై విమర్శలు చేశారు. ధనార్జనే ధ్యేయంగా మంత్రి పనిచేస్తున్నారని ఆరోపించారు.
పల్నాడు జిల్లా: తెలుగుదేశంపార్టీ సీనియర్ నేత (TDP Leader), మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (Prattipati Pullarao) ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని (Minister Vidadala Rajini)పై విమర్శలు చేశారు. ధనార్జనే ధ్యేయంగా మంత్రి పనిచేస్తున్నారని ఆరోపించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రజిని అవినీతి చిట్టాకు లెక్కే లేదని.. ఇంకా ఎంత దోచుకుంటారో తెలియదని అన్నారు. మంత్రి విడదల రజిని ఆరోగ్యశాఖను పూర్తిగా భ్రష్టుపట్టించారని విమర్శించారు. ఆస్పత్రుల్లో కనీసం మందులు కూడా అందుబాటులో ఉండట్లేదన్నారు. మంత్రి అవినీతిపై రాష్ట్రం మొత్తం కోడై కూస్తోందన్నారు.
వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీ నుంచి బదిలీల వరకు అవినీతే జరుగుతోందని, భూవివాదం ఉన్నచోట తలదూర్చి సెటిల్ మెంట్లు చేస్తున్నారని ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. కుటుంబీకులను ముందు పెట్టి అవినీతి వ్యవహారాలను చక్కబెడుతున్నారని, చిలకలూరిపేట మున్సిపాలిటీని అవినీతికి అడ్డాగా మార్చారన్నారు. పనులు చేయకుండానే రూ.2.70 కోట్ల బిల్లులు చేసుకున్నారని, ప్రజాధనాన్ని మంత్రి రజని సొంతానికి వాడుకుంటున్నారని విమర్శించారు. మున్సిపల్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది మొత్తం మంత్రి కుటుంబీకులేనని, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో రూ.50 లక్షల అవినీతి జరిగిందని ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రస్థాయిలో ఆరోపించారు.
Updated Date - 2023-08-17T22:06:30+05:30 IST