Palnadu Dist.: మాచర్లలో వైసీపీ నేతల దౌర్జన్యం
ABN, First Publish Date - 2023-10-16T16:18:21+05:30
పల్నాడు జిల్లా: మాచర్లలో వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. విపి సౌత్ గ్రామంలో 20 ఏళ్లుగా 5 ఎకరాల్లో సాగు చేసుకుంటున్న గిరిజన కుటుంబం పాతలావత్ ధూప్ సింగ్ కుటుంబంపై దాడి చేసి 5 ఎకరాల భూమిని ఆక్రమించారు.
పల్నాడు జిల్లా: మాచర్లలో వైసీపీ నేతలు (YCP Leaders) దౌర్జన్యానికి పాల్పడ్డారు. విపి సౌత్ గ్రామంలో 20 ఏళ్లుగా 5 ఎకరాల్లో సాగు చేసుకుంటున్న గిరిజన కుటుంబం (Tribal family) పాతలావత్ ధూప్ సింగ్ (Patalavat Dhoop Singh) కుటుంబంపై దాడి చేసి 5 ఎకరాల భూమిని ఆక్రమించారు. తమపై కొత్తూరు వైసీపీ సర్పంచ్ (YCP Sarpanch) పాపిరెడ్డి (Papireddy), రామిరెడ్డి (Ramireddy), వెంకట రామిరెడ్డి (Venka Ramireddy), వెంకట రామయ్య (Venkata Ramaiah), పూర్ణయ్య (Purnaiah)లు దాడి చేశారని ధూప్ సింగ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. మాచర్ల పోలీసులకు ఫిర్యాదు చేస్తే పొలం వదులుకొని వెళ్ళిపొమ్మంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌కు ధూప్ సింగ్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Updated Date - 2023-10-16T16:18:21+05:30 IST