ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP కీలక నేతకు గుండెపోటు.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు

ABN, First Publish Date - 2023-01-29T08:15:32+05:30

టీడీపీ కీలక నేత, ఎమ్మెల్సీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ : టీడీపీ కీలక నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు (Batchula arjunudu) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా గుండెనొప్పి (Heart Attack) రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని (Vijayawada) రమేశ్ ఆస్పత్రికి (Ramesh Hospital) తరలించారు. అత్యవసర విభాగంలో ప్రత్యేక వైద్య బృందం బచ్చులకు స్టంట్ వేసి చికిత్స (Treatment) అందిస్తోంది. బీపీ ఎక్కువగా ఉన్నందున అర్జునుడి ఆరోగ్యం విషమంగానే ఉందని డాక్లర్టు చెబుతున్నారు.

బచ్చుల విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu) బచ్చుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులు, వైద్యులతో ఫోన్‌లో (Phone Call) మాట్లాడి తెలుసుకుంటున్నారు. మరోవైపు టీడీపీ (Telugudesam) ముఖ్యనేతలు రమేశ్ ఆస్పత్రికి చేరుకుని బచ్చుల ఆరోగ్యపరిస్థితిపై ఆరా తీస్తున్నారు.

గతంలోనూ ఇలాగే..!

2021లోనూ బచ్చుల గుండెపోటుకు గురయ్యారు. అప్పుడు కూడా ఇదే రమేశ్ ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యులు వైద్యం చేయించారు. అత్యవసర శస్త్రచికిత్స (Emergency Surgery) అందించడంతో గతంలో ప్రాణాపాయం తప్పింది. సర్జరీ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి కుదుటపడింది. అయితే ఇవాళ తెల్లవారుజామున మరోసారి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు, ఆయన అనుచరులు ఆందోళన చెందుతున్నారు.

కరోనాతో ఇబ్బంది పడి..!

కరోనా సమయంలో బచ్చులకు రెండుసార్లు వైరస్ (Corona Virus) సోకింది. అప్పటి నుంచి ఆయన పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. కరోనా తర్వాత ఊపిరితిత్తుల సమస్యతో బాధపడటం, గుండెపోటు రావడం జరుగుతోందని బచ్చుల అనుచరులు చెబుతున్నారు. కాగా బచ్చుల ప్రస్తుతం గన్నవరం టీడీపీ ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) టీడీపీకి (TDP) దూరమవ్వడంతో గన్నవరం (Gannavaram) బాధ్యతలను బచ్చులకు చంద్రబాబు అప్పగించారు. నాటి నుంచి నియోజకవర్గంలో కార్యకర్తలు, ప్రజా సమస్యల పరిష్కారానికై బచ్చుల కృషి చేస్తూ వస్తున్నారు.

Updated Date - 2023-01-29T08:38:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising