Venkatakrishna: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బృందంపై జగన్ పార్టీ దాడి హేయమైన చర్య
ABN, First Publish Date - 2023-05-19T19:47:23+05:30
కవరేజ్ కోసం వెళ్లిన ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి (ABN -Andhrajyothy) ప్రతినిధుల బృందంపై కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ( KADAPA YCP MP Avinash Reddy) అనుచరులు దాడి చేయడం హేయమైన చర్య అని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యుడు వెంకటకృష్ణ అన్నారు.
కర్నూలు జిల్లా: కవరేజ్ కోసం వెళ్లిన ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి (ABN -Andhrajyothy) ప్రతినిధుల బృందంపై కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ( KADAPA YCP MP Avinash Reddy) అనుచరులు దాడి చేయడం హేయమైన చర్య అని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యుడు వెంకటకృష్ణ అన్నారు. జర్నలిస్టులే సలహాదారులుగా ఉన్న జగన్‌రెడ్డి పార్టీ ఇలాంటి దాడులు చేయడం సిగ్గుచేటని ఐజేయూ సభ్యుడు వెంకటకృష్ణ (IJU member Venkatakrishna) మండిపడ్డారు.
ఏబీఎన్ -ఆంధ్రజ్యోతి ప్రతినిధులపై ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) అనుచరులు దాడి చేయడం పాశవిక చర్యగా భావిస్తున్నామని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (JAAP) అధ్యక్షులు రవితేజ, ఉఫాధ్యక్షులు ఆర్‌వి సూర్యనారాయణరెడ్డి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు ఉప్పల లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అవినాష్ రెడ్డి అనుచరులు మీడియాను అడ్డుకోవాలని అనుకోటం ఫ్యాక్షనిజానికి నిదర్శనమని మండిపడ్డారు. అవినాష్ రెడ్డి సీబీఐ ముందు హాజరవుతున్నాడా లేక పారిపోతున్నాడా అన్న విషయం ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత మీడియాపై ఉందన్నారు.
అవినాష్ రెడ్డి బాధ్యత గల ప్రజాప్రతినిధిగా తాను సీపీఐ వద్ద హాజరవుతున్నానా లేక పులివెందులకు వెళ్తున్నానా అనే విషయాన్ని ఎందుకు మీడియాకు వెల్లడించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులను జర్నలిస్టుల సంఘాలు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించవని స్పష్టం చేశారు. బాధ్యతగల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రోజూ మీడియాను తిట్టడాన్నే పనిగా పెట్టుకున్నారన్నారు. ఇలా దాడులను ఆయన కూడా ప్రోత్సహిస్తున్నారా అన్న అనుమానం వస్తోందని తెలిపారు. ఈ దాడులను జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (JAAP) పూర్తిగా ఖండిస్తోందన్నారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి రిమాండ్ పంపాలని జాప్ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
Updated Date - 2023-05-19T19:48:57+05:30 IST