ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLA Roja: రానున్న ఎన్నికల్లో రోజాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వరా.. ఆయన ఇలా అన్నారేంటి..!?

ABN, First Publish Date - 2023-02-10T16:43:53+05:30

ఏపీ మంత్రి రోజా (AP Minister Roja) తన శాఖలోని ఉద్యోగితో చెప్పులు మోయించారన్న ఆరోపణలతో చర్చనీయాంశమయ్యారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: ఏపీ మంత్రి రోజా (AP Minister Roja) తన శాఖలోని ఉద్యోగితో చెప్పులు మోయించారన్న ఆరోపణలతో చర్చనీయాంశమయ్యారు. ఈ వ్యవహారంపై తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ (Kiran Royal) రియాక్ట్ అయ్యారు. ‘రోజా గారు మీ మంత్రి పదవి శాశ్వతం అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో రోజాకు ఎమ్మెల్యే టికెట్ (MLA Ticket) కూడా ఇవ్వరు. మంత్రి పదవిలో ఇంకా తొమ్మిది నెలలు మాత్రమే ఉంటారు. ఆ తర్వాత మీ భవిష్యత్తు ఏలా ఉంటుందో తెలుసుకోవాలి’ అని ఒకింత వార్నింగ్ (Warning) ఇచ్చారు.

విమర్శల వర్షం..

గురువారం సూర్యలంక (Surya Lanka) బీచ్‌‌ను సందర్శించిన రోజా.. పర్యాటకశాఖ హౌస్‌ కీపింగ్‌ ఉద్యోగితో చెప్పులు (Sandals) మోయించుకున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనిపై కిరణ్ రాయల్ మండిపడ్డారు. మంత్రి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పర్యాటక ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలున్నాయో తెలుసుకుని.. కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పర్యాటకశాఖా మంత్రిగా ఆ శాఖను అభివృద్ధి చేయకుండా తన కుటుంబాన్ని అభివృద్ది చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులపై కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందని కిరణ్ రాయల్ ధ్వజమెత్తారు.

ఉద్యోగితో చెప్పులు మోయించిన మంత్రి రోజా..

మంత్రి రోజా గురువారం బాపట్ల జిల్లా సూర్యలంక సముద్ర తీరాన్ని సందర్శించారు. ఆ సమయంలో సముద్ర జలాల్లోకి దిగుతూ చెప్పులు విడిచిపెట్టారు. ఆ చెప్పులను పర్యాటకశాఖ హౌస్‌ కీపింగ్‌ ఉద్యోగి చేతితో పట్టుకుని ఆమె వెనుకాలే వెళ్ళి తిరిగి ఒడ్డుకు వచ్చిన తర్వాత కాళ్ళ దగ్గర పెట్టారు. ఈ ఘటన అనేక విమర్శలకు దారితీసింది. అధికార అహంకారంతో ఉద్యోగి చేత మంత్రి చెప్పులు మోయించారని పలువురు విమర్శిస్తున్నారు. పర్యాటకశాఖ సిబ్బంది మాత్రం దీనిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

లేపాక్షిలోనూ రోజా అధికారదర్పం..

ఆ మధ్య లేపాక్షి ఆలయం (Lepakshi Temple)లోనూ రోజా అధికార దర్పాన్ని ప్రదర్శించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీసత్యసాయి జిల్లాలోని లేపాక్షి దుర్గా, వీరభద్రస్వామి ఆలయ సందర్శనలో ఓవరాక్షన్‌ చేశారన్న విమర్శలు భక్తుల నుంచి వినిపించాయి. ఆలయంలోకి మంత్రితోపాటు జనం కూడా వెళ్లడం మంత్రికి కోపం తెప్పించింది. తాను వచ్చింది గుడి చూడటానికా.. జనాన్ని చూడటానికా అని పోలీసులపై చిర్రుబుర్రులాడారు. దీంతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా ప్రధాన ద్వారాన్ని పది నిముషాల పాటు మూసేశారు. అప్పట్లో రోజా తీరుపై తీవ్రమైన విమర్శలు కూడా వచ్చాయి.

Updated Date - 2023-02-10T16:52:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising