ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

JC Prabhakar: ప్రజాప్రతినిధుల కోర్టుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి

ABN, First Publish Date - 2023-05-11T19:39:42+05:30

టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి (JC Prabhakar) విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు గురువారం హాజరయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి (JC Prabhakar Reddy) విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకు గురువారం హాజరయ్యారు. వాహనాల రిజిస్ట్రేషన్‌ (Registration)లపై నమోదైన కేసులో ఆయన కోర్టుకు వచ్చారు. తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది. రాజకీయ వేధింపులు మంచిది కాదని ఆయన కోర్టు బయట వ్యాఖ్యానించారు. కేసులు పెట్టుకుంటూపోతే అందరూ జైళ్లలోనే ఉంటారన్నారు. తనపై పెట్టిన కేసులు ఇప్పట్లో తేలవని, దేవుడు తనకు మరో జన్మ ఇవ్వాలని అన్నారు. కోర్టుకు వచ్చినప్పుడు తాము న్యాయమూర్తులకు గౌరవం ఇస్తామన్నారు. కోర్టు హాలులోకి వెళ్లేటప్పుడు బయట తన మనుషులకు ఫోన్‌ ఇచ్చి వెళ్తానని జేసీ ప్రభాకర్‌రెడ్డి చెప్పారు.

కోడికత్తి కేసు జూన్‌ 15కి వాయిదా

వైఎస్‌ జగన్‌ (CM Jagan)పై కోడికత్తితో జరిగిన దాడి కేసు విచారణ జూన్‌ 15వ తేదీకి వాయిదా పడింది. జగన్‌ దాఖలు చేసిన రెండు పిటిషన్లపై ఆయన తరపున న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు వాదనలు వినిపించాల్సి ఉంది. గురువారం జగన్‌ తరపున న్యాయవాదులు, నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు కోర్టుకు హాజరయ్యారు. వాదనలను వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేసినట్టు ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి సత్యానందం ప్రకటించారు.

Updated Date - 2023-05-11T19:39:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising