Avinash In Viveka Case : సీబీఐ ఆఫీస్ ముందు భారీగా పోలీసుల మోహరింపు.. అవినాష్‌ను అరెస్ట్ చేస్తారేమోనని వైసీపీలో టెన్షన్.. టెన్షన్..
ABN , First Publish Date - 2023-05-19T10:35:31+05:30 IST
వివేకా హత్య కేసులో విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి నేటి ఉదయం 10:30 గంటలకే ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. కానీ అవినాష్ రెడ్డి ఇప్పటికీ సీబీఐ కార్యాలయానికి బయలుదేరలేదు. ఇంకా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలోనే అవినాష్ రెడ్డి ఉన్నారు. అవినాష్ రెడ్డి నివాసానికి న్యాయవాదులు చేరుకున్నారు. అలాగే ఆయన మద్దతుదారులు, అనుచరులు సైతం భారీగా చేరుకున్నారు.
హైదరాబాద్ : వివేకా హత్య కేసులో విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి నేటి ఉదయం 10:30 గంటలకే ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది. కానీ అవినాష్ రెడ్డి ఇప్పటికీ సీబీఐ కార్యాలయానికి బయలుదేరలేదు. ఇంకా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలోనే అవినాష్ రెడ్డి ఉన్నారు. అవినాష్ రెడ్డి నివాసానికి న్యాయవాదులు చేరుకున్నారు. అలాగే ఆయన మద్దతుదారులు, అనుచరులు సైతం భారీగా చేరుకున్నారు. తన నివాసంలో న్యాయవాదులతో అవినాష్ రెడ్డి చర్చిస్తున్నారు. నేడు అవినాష్ రెడ్డినీ సీబీఐ అరెస్ట్ చేస్తారని పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీంతో అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు వెళతారా? లేదా? అన్న విషయంలో సందిగ్ధత నెలకొంది.
కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు గత మంగళవారమే విచారణకు హాజరకాలంటూ నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన విచారణకు సంబంధించిన విషయంలో మరో నాలుగు రోజుల గడువు కావాలని చెప్పి సీబీఐను అభ్యర్ధించారు. మరోవైపు సీబీఐ కార్యాలయం వద్ద కూడా అవినాష్ వస్తారనే ఉద్దోశంతో సీబీఐ అధికారులు చాలా సేపు ఎదురు చూశారు. ఇవాళ కూడా అలాగే జరుగుతుందో లేదంటే అవినాష్ రెడ్డి విచారణకు వెళతారో మరికొద్ది సేపట్లో తెలియనుంది. మరోవైపు ఏపీలో అవినాష్ విచారణ తర్వాత అరెస్ట్ చేస్తారా? లేదా? అనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. అయితే అవినాష్ అరెస్ట్ పక్కా అని సమాచారం రావడంతో పులివెందుల నుంచి అభిమానులు, కార్యకర్తలు, అనుచరులు తరలివచ్చారు. ఈ క్రమంలోనే నివాసం దగ్గర.. సీబీఐ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మొత్తానికి వైసీపీలో టెన్షన్ మొదలైంది.