Avinash Reddy : అవినాశ్‌కు సుప్రీంలో షాక్.. ముందస్తు బెయిల్‌పై జోక్యానికి నిరాకరణ
ABN , First Publish Date - 2023-05-23T12:52:12+05:30 IST
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అవినాశ్ ముందస్తు బెయిల్‌పై జోక్యానికి సుప్రీం నిరాకరించింది. హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. 25న హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాశ్ ముందస్తు బెయిల్‌పై విచారణ జరపాలని సుప్రీంకోర్టు తెలిపింది. అంతవరకూ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా సీబీఐకి అదేశాలు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఢిల్లీ : వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అవినాశ్ ముందస్తు బెయిల్‌పై జోక్యానికి సుప్రీం నిరాకరించింది. హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు సూచించింది. 25న హైకోర్టు వెకేషన్ బెంచ్ అవినాశ్ ముందస్తు బెయిల్‌పై విచారణ జరపాలని సుప్రీంకోర్టు తెలిపింది. అంతవరకూ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా సీబీఐకి అదేశాలు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తాను దాఖలు చేసుకున్న ముందస్తు బెయి ల్ పిటిషన్‌ను వెకేషన్ బెంచ్ విచారించేలా తెలంగాణ హైకోర్టును ఆదేశించాలని కోరుతూ వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. తన తల్లికి అనారోగ్యం కారణంగా సీబీఐ విచారణకు వారం రోజుల పాటు మినహాయింపు ఇవ్వాలని కూడా అవినాశ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ‘వచ్చే నెల 6న తెలంగాణ హైకోర్టులో పిటిషన్ విచారణకు వచ్చేవరకు అరెస్టు చేయకుండా ఆదేశించండి. లేదంటే ఈ నెల 25న హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారించాలని ఆదేశించి అప్పటి వరకు అరెస్టు చేయొద్దని ఉత్తర్వులివ్వండి’ అని అభ్యర్థించారు. ఈ హత్య కేసు దర్యాప్తును ట్రయల్ కోర్టు పర్యవేక్షించవచ్చా.. లేదా? అన్న అంశంపై స్పష్టత ఇవ్వాలని వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి దాఖలు చేసిన అప్లికేషన్‌ను ఆయన దరఖాస్తుతో కోర్టు జత చేసింది.
ఈ రెండింటినీ కలిపి మంగళవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహతో కూడిన వెకేషన్ ధర్మాసనం ఎదుట 36వ విచారణ కేసుగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ చేర్చింది. సోమవారం అవినాశ్‌రెడ్డి అప్లికేషన్‌ను జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సంజయ్ కరోల్‌లతో కూడిన ధర్మాసనం ముందు ఆయన తరఫున న్యాయవాదులు ప్రస్తావించారు. మంగళవారం నాటి కేసుల జాబితాలో ఈ అప్లికేషన్‌ను చేర్చాలని సీనియర్ న్యాయవాది వి.గిరి విజ్ఞప్తి చేశారు. ‘మెన్షనింగ్ కార్యాలయానికి మీ న్యాయవాదిని పంపించి కేసును ప్రస్తావించమని చెప్పండి. సాధ్యమైతే మంగళవారం విచారణ జరుపుతాం’ అని జస్టిస్ అనిరుద్ధ బోస్ ఆయనకు సూచించారు.