TDP Leader: కాపుల గురించి తప్పుగా నోరు జారితే.. కొడాలినానిపై టీడీపీ నేత ఆగ్రహం
ABN , First Publish Date - 2023-05-30T12:32:25+05:30 IST
మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ సీనియర్ నేత, బలిజ సంఘనాయకుడు హరిప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కడప: మాజీ మంత్రి కొడాలి నానిపై (Former Minister kodali Nani) టీడీపీ సీనియర్ నేత, బలిజ సంఘనాయకుడు హరిప్రసాద్ (TDP Senior Leader Hariprasad) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ‘‘కొడాలి నాని అంటే గుట్కా నాని... నువ్వు కాపుల గురుంచి తప్పుగా నోరు జారితే నాలుక కోస్తాం’’ అంటూ హెచ్చరించారు. కొడాలినాని కల్లు తాగిన కోతిలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. జగన్ బ్రాండ్ మందు తాగి నానికి పిచ్చి పట్టినట్లు ఉందని వ్యాఖ్యలు చేశారు. రానున్న కాలంలో నానిని పిచ్చి ఆసుపత్రిలో చేర్పించడం తప్పదన్నారు. కాపుల గురుంచి అవాకులు చెవాకులు మాట్లాడితే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. వైసీపీ కాపు నాయకులు మేల్కొని పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాపులను అవహేళనగా మాట్లాడిన కొడాలి నాని ఇంటిని ముట్టడిస్తామన్నారు. కొడాలి నాని నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో కొడాలి నానికి కాపులే బుద్ధి చెబుతారని హరిప్రసాద్ వ్యాఖ్యలు చేశారు.