ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YS Sharmila: పార్టీ విలీనంపై షర్మిల ఆసక్తికర కామెంట్

ABN, First Publish Date - 2023-09-02T11:44:09+05:30

వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల స్పందించారు.

కడప: వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల (YSRTP Chief YS Sharmila) స్పందించారు. శనివారం దివంగత నేత వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ఇడుపులపాయకు వచ్చిన షర్మిల... తండ్రి సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పార్టీ విలీనంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. వైఎస్సార్టీపీ పార్టీ విలీనంపై మాట్లాడేందుకు ఇది వేదిక కాదని తెలిపారు. 14 ఏళ్ళైనా ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ ఇంకాబ్రతికే ఉన్నారన్నారు. వైఎస్ అద్భుతమైన పధకాలు ద్వారా కోట్లమంది ప్రజల గుండెల్లో ఉన్నారని తెలిపారు. రైతు పక్షపాతిగా ఉండి విద్యుత్ బకాయిలను మాఫీచేసి, ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేసిన మహానేత అంటూ కొనియాడారు. మహిళలకు పావలా వడ్డీ ద్వారా ఎన్నో కుటుంబాలలో వెలుగు నింపారన్నారు. పేద విద్యార్దులకు ఏ చదువు చదవడానికైనా ఫీజ్ రీఏంబర్స్‌మెంట్ పెట్టారన్నారు. 108, ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మంది ప్రాణాలు నిలిపారన్నారు. కుల మతాలకు, పార్టీలకు అతీతంగా పధకాలు అందించారన్నారు. వైఎస్సార్ చనిపోయినప్పుడు ఆ బాధ తట్టుకోలేక 700 మంది గుండె ఆగిందన్నారు. వారి కుటుంబాలకు కూడా ప్రగాఢ సంతాపం తెలియచేస్తూ వైఎస్సార్ బిడ్డగా వారి త్యాగాలు మరిచిపోనని వైఎస్ షర్మిల తెలిపారు.

Updated Date - 2023-09-02T11:44:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising