Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్టవుతుంది: వివేక్
ABN , First Publish Date - 2023-02-27T21:12:25+05:30 IST
ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) తరహాలో సీఎం కేసీఆర్ (CM KCR) కుమార్తె కవిత
తిరుమల: ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Scam) కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) తరహాలో సీఎం కేసీఆర్ (CM KCR) కుమార్తె కవిత (Kavitha) కూడా అరెస్టవుతుందని బీజేపీ నేత వివేక్ (vivek) జోస్యం చెప్పారు. సోమవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. అమ్‌ఆద్మీ పార్టీకి ఎన్నికల ఖర్చు కోసం రూ.150 కోట్లు కవిత ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ తరహాలో లిక్కర్ స్కాంను ఢిల్లీలో కూడా అమలు చేసేందుకు ప్రయత్నించారన్నారని ఆరోపించారు తెలంగాణాలో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు బీఆర్‌ఎస్‌ను పెట్టి కేసీఆర్ దేశమంతా తిరుగుతున్నారన్నారని ఆయన విమర్శించారు. అసలు నిధులే లేకుండా ఏర్పడిన టీఆర్‌ఎస్ నేడు ధనిక పార్టీగా ఎలా మారిందని ప్రశ్నించారు. అదంతా ప్రజల సొమ్మే అన్నారు. ఇటీవల రూ.400 కోట్లతో ఓ విమానాన్ని కూడా కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మెగా కృష్ణారెడ్డిని ప్రపంచంలోనే ధనికుడిగా చేసిన ఘనత కేసీఆర్‌కే చెందుతుందన్నారు. మహారాష్ట్ర, ఏపీ వంటి రాష్ట్రాల్లో అవుట్‌డేటెడ్ నాయకులను తీసుకుని బీఆర్‌ఎస్ పేరుతో తిరుగుతున్నారని వివేక్ దుయ్యబట్టారు.
సిసోడియా అరెస్టు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ ఆదివారం మనీశ్ సిసోడియాను అరెస్టు చేసింది. సుమారు 8 గంటల పాటు ప్రశ్నించినా ఆయన నుంచి సంతృప్తికరమైన సమాధానాలు రాలేదని సీబీఐ అధికారులు తెలిపారు. సోమవారం సీబీఐ కోర్టులో ఆయనను హాజరుపరిచి రిమాండ్ కోరే అవకాశం ఉంది. ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఈ కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.