ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bonda Uma: ఆ మీడియా, దాని యాజమాన్యానికి ప్రతిదీ క్విడ్ ప్రోకోగానే కనిపిస్తుంది..

ABN, First Publish Date - 2023-07-03T16:22:15+05:30

విజయవాడ: లింగమనేని గెస్ట్ హౌస్ అటాచ్ మెంట్‌పై ఏసీబీ కోర్టు తీర్పుకు సీఎం జగన్ రెడ్డి, అతని అవినీతి మీడియా వక్ర భాష్యాలు చెబుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: లింగమనేని గెస్ట్ హౌస్ (Lingamaneni Guest House) అటాచ్ మెంట్‌పై ఏసీబీ కోర్టు (ACB Court) తీర్పుకు సీఎం జగన్ రెడ్డి (CM Jagan), అతని అవినీతి మీడియా వక్ర భాష్యాలు చెబుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswararao) అన్నారు. ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు, క్విడ్ ప్రోకో నుంచి పుట్టిన సాక్షిమీడియాకు, దాని యాజమాన్యానికి ప్రతిదీ క్విడ్ ప్రోకోగానే కనిపిస్తుందన్నారు. రాజధానిలో క్విడ్ ప్రోకో అని గతంలో జగన్ విషప్రచారం చేశారని, ముఖ్యమంత్రి అయ్యాక ఎలాంటి విచారణ జరపకుండా తేలుకుట్టిన దొంగలా ఉండిపోయారన్నారు. గతంలో అధికారం కోసం రాజధానిలో 5 లక్షల కోట్ల విలువైన భూములు కొట్టేశారన్న జగన్ రెడ్డి, 4 ఏళ్లలో దానిపై ఎందుకు విచారణ జరిపించలేదని ప్రశ్నించారు.

విష ప్రచారం చేయడం.. ప్రజల మెదళ్లలో విషబీజాలు నాటి పబ్బం గడుపుకోవడం జగన్ రెడ్డికి అవినీతితో అబ్బిన విద్యని బోండా ఉమా అన్నారు. 2005లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం లింగమనేని గెస్ట్ హౌస్ నిర్మాణానికి అనుమతిచ్చిందని, ఆనాడు అది సక్రమకట్టడమేనని ఉడా విభాగం తేల్చిందన్నారు. 2020లో జగన్ రెడ్డికి మాత్రం అది అక్రమకట్టడంగా కనిపించిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ ఒక్కటే జగన్‌కు, అతని ప్రభుత్వానికి అక్రమకట్టడంగా కనిపించడం పైశాచికత్వంకాక మరేమిటని ప్రశ్నించారు. అదే కరకట్టపై ఉన్న ఆశ్రమాలు, ఇస్కాన్ మందిరాలు, ప్రకృతి వైద్యశాలలు, ఇతరత్రా కట్టడాలు ఏవీ జగన్ రెడ్డికి అక్రమకట్టడాలుగా కనిపించలేదా? అంటూ నిలదీశారు. లింగమనేని గెస్ట్ హౌస్ చంద్రబాబు సొంత ఆస్తికాదని, గత ప్రభుత్వం దాన్ని ఆయన అధికారిక నివాసంగా కేటాయించిందన్నారు. ప్రభుత్వం ముఖ్యమంత్రులకు, ప్రతిపక్షనేతలకు అధికారిక నివాసాలు కేటాయించడం ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయమేనని అన్నారు.

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ (ప్రతిపక్షనేత) కోరినట్టు, లోటస్ పాండ్ భవనాన్ని ఆయన అధికారిక నివాసంగా గుర్తించిన విషయాన్ని ఈ సందర్భంగా బోండా ఉమా గుర్తు చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ పరంగా నేటికీ చంద్రబాబుకు అధికారిక నివాసం కేటాయించలేదని విమర్శించారు. ఉంటున్నదాన్నే అక్రమకట్టడమని, కూల్చేస్తామని బెదిరిస్తున్నారన్నారు. జగన్ రెడ్డి గతంలో చంద్రబాబు రూ.6 లక్షల కోట్లు మింగేశారని ఎంపరర్ ఆఫ్ కరెప్షన్ పేరుతో తప్పుడు సమాచారంతో పుస్తకాలు ముద్రించారని, ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కరోజు కూడా దానిపై మాట్లాడలేదని దుయ్యబట్టారు. జగన్ విషప్రచారంలో సిద్ధహస్తుడని ప్రజలకు బాగా అర్థమైందన్నారు. అధికార మదంతో జగన్ చేసే ప్రతిపని, మాట్లాడే ప్రతిమాటకు టీడీపీ ప్రభుత్వం రాగానే ఇంతకింత బదులిస్తామని బోండా ఉమా హెచ్చరించారు.

Updated Date - 2023-07-03T16:22:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising