Bonda Uma: రాష్ట్రంలో లక్షకోట్ల అవినీతి..

ABN , First Publish Date - 2023-06-28T15:15:18+05:30 IST

విజయవాడ: సమగ్రభూసర్వే పథకం ముసుగులో రాష్ట్రంలో లక్షకోట్ల అవినీతి జరిగిందని, జే గ్యాంగ్ తమ భూ దోపిడీ కోసం 22ఏను ఆయుధంగా మార్చుకుందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు.

Bonda Uma: రాష్ట్రంలో లక్షకోట్ల అవినీతి..

విజయవాడ: సమగ్ర భూ సర్వే పథకం ముసుగులో రాష్ట్రంలో లక్షకోట్ల అవినీతి జరిగిందని, జే గ్యాంగ్ తమ భూ దోపిడీ (Land Grabbing) కోసం 22ఏను ఆయుధంగా మార్చుకుందని టీడీపీ (TDP) పొలిట్ బ్యూరోసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswararao) విమర్శించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ శాశ్వత భూ హక్కు పేరుతో ప్రజల భూముల్ని జగన్ (Jagan) శాశ్వతంగా వారికి దూరంచేస్తున్నారని, దొంగ సర్వేలతో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 2లక్షల ఎకరాల్ని 22ఏ జాబితాలో చేర్పించారని ఆరోపించారు. అధికారుల్ని భూ యజమానులు, సాగుదారుల ఇళ్లకు పంపించి, 22ఏ జాబితా పేరు చెప్సి, సెటిల్ మెంట్లపేరుతో భయపెట్టి, కారుచౌకగా వాటిని కాజేస్తున్నారన్నారు.

వివాదాలులేని భూముల్ని 22ఏ జాబితాలో చేర్పించి, ఇష్టానుసారం వాటిని తొలగిస్తూ జగన్ అండ్ కో (Jagan and Co) యథేచ్ఛగా భూ దోపిడీకి పాల్పడుతున్నారని బోండా ఉమా విమర్శించారు. తమకు నచ్చినభూమి కనిపిస్తే చాలు దాన్ని దక్కించుకునేవరకు అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు నిద్రపోవడంలేదన్నారు. జగన్ భూ దోపిడీ దెబ్బకు సొంత పార్టీ ఎంపీ కుటుంబమే కిడ్నాప్‌కు గురైందన్నారు. ప్రభుత్వానికి భయపడిన విశాఖపట్నం ఎంపీ ఆఖరికి రాష్ట్రం విడిచిపోవడానికి సిద్ధమయ్యారన్నారు. పెనమలూరులో ఎన్ఆర్ఐ శ్రీనివాసరావు భూమిని కాజేయడానికి అతన్ని కిడ్నాప్ చేయించడానికి సిద్ధమయ్యారని, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న 22ఏ జాబితా అవకతవకలపై, వైసీపీ నేతల భూ దోపిడీపై, సమగ్రదర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే జగన్ అండ్ కో ఇష్టానుసారం సాగించిన భూ దోపిడీ నిగ్గు తేలుస్తామన్నారు. భూముల్ని కబ్జా చేసిన వారిని, సహకరించిన అధికారుల్ని కఠినంగా శిక్షించి, భూముల్ని కోల్పోయినవారికి న్యాయంచేస్తామని బోండా ఉమామహేశ్వరరావు అన్నారు.

Updated Date - 2023-06-28T15:15:18+05:30 IST