AP News : కొడాలి నాని ఇలాఖాలో దారుణం.. సెల్‌ఫోన్ వీడియోలతో విషయం వెలుగులోకి..
ABN , First Publish Date - 2023-09-14T09:02:23+05:30 IST
మాజీ మంత్రి, కొడాలి నాని ఇలాఖాలోని గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో పరిస్థితి దారుణంగా ఉంది. అర్ధరాత్రి అంధకారంలో హాస్పిటల్ ఉన్నా కూడా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
విజయవాడ : మాజీ మంత్రి, కొడాలి నాని ఇలాఖాలోని గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో పరిస్థితి దారుణంగా ఉంది. అర్ధరాత్రి అంధకారంలో హాస్పిటల్ ఉన్నా కూడా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. తరచూ కరెంటు పోతున్నా కూడా సిబ్బంది కనీసం జనరేటర్ కూడా ఆన్ చేయడం లేదు. బుధవారం రాత్రి కరెంటు పోవడంతో రెండు గంటల పాటు చంటి పిల్లలు, రోగులు నరకయాతన అనుభవించారు. కరెంటు పోయినా కూడా సిబ్బంది జనరేటర్ ఆన్ చేయకపోవడంతో రోగులంతా తీవ్ర అవస్థకు గురయ్యారు. తమ దుస్థితిని కొందరు రోగులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లాస్థాయి అధికారుల స్పందనతో అర్ధరాత్రి జనరేటర్‌ను సిబ్బంది ఆన్ చేశారు. రాత్రి తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర వరకూ సెల్ఫోన్ల వెలుగులోనే రోగులు కొట్టుమిట్టాడారు. తరచూ ఇదే తంతు జరుగుతున్నా కూడా హాస్పిటల్ అదికారులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు.